Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన చిరంజీవి ‘ముఠామేస్త్రి’

91,428FansLike
56,273FollowersFollow

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన తీరు ఒక అద్భుతం. క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి, అలవోకగా కామెడీ పండిస్తూ, తన హావభావాలతో మాస్ హీరోగా తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. అలా.. చిరంజీవి మాస్ ఇమేజ్ ను మరోస్థాయిలో నిలబెట్టిన సినిమా ‘ముఠామేస్త్రి’. మెగాస్టార్ గా శిఖరంలాంటి క్రేజ్ తో ముఠామేస్త్రిగా ఊరమాస్ పాత్రలో చిరంజీవి అలరించారు. ముఖ్యంగా.. రఫ్ గెడ్డం, లుంగీ కట్టు, మెడలో ఎర్ర తువ్వాలుతో మేకోవర్ మాస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సినిమాలో ఆయన కామెడీ టైమింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. దీంతో చిరంజీవి కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచింది ‘ముఠామేస్త్రి’
.
మాస్ డైలాగులు..

సినిమాలో చిరంజీవి ఎంట్రన్స్ నుంచే పాత్ర తాలూకు స్వభావం తెలిసిపోతుంది. క్యారెక్టర్ బేస్డ్ సినిమా కావడంతో కూరగాయల మార్కెట్ లో రాజకీయాలు, సమస్యలను పరిష్కరిస్తూ చివరిగా రాజకీయాల్లోకి వెళ్లడమే సినిమా కథ. దీంతో.. ముఠామేస్త్రి సినిమాతోనే ‘చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే..’ అనే ఊహాగానాలు అప్పట్లోనే వచ్చాయి. సినిమాలో రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా చేయడం ఇందుకు కారణమైంది. సినిమాలో చిరంజీవి మాస్ డైలాగ్ వెర్షన్, వాటిని పలికే తీరు చిరంజీవే సాటి అనేలా చేశాయి. విలన్లను ‘దొంగనాడొడుకు’, సీఎంతో మీనాను ఉద్దేశించి.. ‘నా జింగులకిడి’ అనడం, మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో.. ‘నేను మంత్రిని కదా.. స్టెప్పేస్తే బాగోదు’, బోసూ.. అని విలన్ అంటే.. నోసు పగిలిపోద్ది.. బామ్మర్దిని పిలిచినట్టు ఏంటా చనువు’.. అనే డైలాగులే ఇందుకు నిదర్శనం. ‘స్టోరీ మారిపోద్ది’ అనే చిరంజీవి మేనరిజమ్ బాగా పేలింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన చిరంజీవి ‘ముఠామేస్త్రి’

చిరంజీవి డ్యాన్సులు..

కామాక్షీ దేవీ కమల్ కంబైన్స్ బ్యానర్ పై కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ముఠామేస్త్రి చిరంజీవితో ఆయనకు ఇదే ఆఖరు సినిమాగా నిలిచింది. సినిమాకు రాజ్-కోటి అందించిన సంగీతం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘ఈ పేటకు నేనే మేస్త్రి..’ టైటిల్ సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది. పాటకు అందించిన సంగీతం, ఎస్పీ బాలు గాత్రానికి తోడు చిరంజీవి వేసిన స్టెప్స్ కు ధియేటర్లు హోరెత్తిపోయాయి. 1993 జనవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి.. 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. సినిమాలో చిరంజీవి నటనకు ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. హీరోయిన్లుగా మీనా, రోజాలకు చిరంజీవితో ఇదే తొలి సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

క్యూటీ అంటూ భార్యకి పుష్పరాజ్‌ క్యూట్‌ గా బర్త్‌ డే విషెష్‌

అల్లు అర్జున్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఆ మధ్య తన పాప అల్లు అర్హ తో ఆట ఆడుకుంటూ ఒకసారి.. పాప...

వీరమల్లు వర్క్‌ షాప్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజులుగా హరిహర వీరమల్లు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మధ్యలో నిలిచి పోవడంతో అభిమానుల్లో ఆందోళన...

మొన్న ‘పే సీఎం’, ఇప్పుడేమో ‘భారతి పే’.! వైసీపీలో ‘బులుగు’ కుంపటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ అధినాయకత్వం పట్ల వ్యతిరేకత వుందా.? రెడ్డి సామాజిక వర్గంలో కొందరు, వైసీపీకి ఎదురు తిరుగుతున్నారా.? సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి...

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...