ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం జరిగిన విషయం విదితమే. అంతలా ఖర్చు చేసేది, ప్రజలకు సేవ చేయడం కోసమేనా.? అంటే, ప్చ్.. ఛాన్సే లేదు.!
ఛత్.. మరీ అంత ఖర్చు జరగకపోవచ్చు.. అని కొందరు అనొచ్చుగాక. కానీ, అన్ని ఖర్చులూ పెరిగిపోయాయ్.! బీరు, బిర్యానీ లేనిదే ఎన్నికల ప్రచారానికి ‘కార్యకర్తలు’ రావడంలేదు. రోజువారీ వేతనం అదనపు ఖర్చు. వీటికి తోడు, మరిన్ని సౌకర్యాలూ కల్పించాలి. ఎలా చూసుకున్నా, ఒక్కో కార్యకర్తకే రోజూ 2 వేల నుంచి ఐదు వేల దాకా ఖర్చు చేయాల్సిన దుస్థితి.
కార్యకర్తల పరిస్థితి ఇది. మరి, తమ వెంట జనాన్ని తిప్పుకుంటే.. దానికి అదనంగా మళ్ళీ బోల్డంత ఖర్చు చేయాలి. రాజకీయాల్ని ఇలా తగలెట్టేశాయ్ ప్రధాన రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పైత్యం మరీ ఎక్కువైపోయింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల విషయమై వివిధ రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు రాజకీయాల పట్ల నైరాశ్యం ప్రదర్శిస్తున్నారట. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
పదవులు దక్కినోళ్ళు అంతకు మించి సంపాదిస్తోంటే, ఆ పదవులు దక్కనోళ్ళేమో.. గత ఎన్నికల్లో చేసిన ఖర్చుల కారణంగా అప్పుల పాలైపోయి, రాజకీయాలంటేనే ఏహ్యభావం పెంచుకుంటున్నారట. ఈ నేపథ్యంలో, ‘బాబ్బాబూ, ఈసారి మీ ఎన్నికల ఖర్చు మేం పెట్టుకుంటాం..’ అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని బతిమాలుకుంటున్నాయట.
ఈ రేసులో అధికార పార్టీ ముందంజలో వుంటే, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ మాత్రం, నాయకుల్ని కొనేది లేదు.. ఓట్లనూ కొనేది లేదు.. అని తెగేసి చెబుతోంది. చిత్రమేంటంటే, పదవులు అనుభవించి, బాగా ‘లాభపడిన’ నాయకులు కూడా, ‘మా ఖర్చులు పార్టీ పెట్టుకోవాల్సిందే..’ అని చెబుతుండడం. అలా కొందరు ప్రజా ప్రతినిథులు పెడుతున్న డిమాండ్లతో అధికార పార్టీ కూడా విలవిల్లాడాల్సి వస్తోందట.
25 నుంచి 30 కోట్లు ఇస్తామని ప్రధాన పార్టీలు ‘ఆఫర్’ ఇస్తోంటే, అవి దేనికి సరిపోతాయని అంటున్నారట నేతలు.. ఇదీ నేటి రాజకీయం.!
192968 660741 very nice post, i surely love this internet site, keep on it 355872
327975 483485Some actually good stuff on this internet internet site , I like it. 516599
964741 707050If your real buddies know you as your nickname, use that nickname as your very first name online. When you very first friend someone, focus on producing a individual comment that weaves connection. 39900