మణిశర్మను మెలోడీ బ్రహ్మ అని కీర్తిస్తుంది తెలుగు సినిమా. లేట్ 90లలో మణిశర్మ హవా మొదలైంది. దాదాపు ఒక దశాబ్దానికి పైగా మణిశర్మ హవా సాగింది. స్టార్ హీరోల అందరి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. తన మ్యూజిక్ తోనే సినిమాను లేపిన సందర్భాలు ఎన్నో. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అందులో మణిశర్మ ది బెస్ట్. మరి అలాంటి మణిశర్మకు డౌన్ ఫాల్ ఎందుకు వచ్చింది. ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే అదే తనకు కూడా అర్ధం కావడం లేదంటున్నాడు.
“నేను శక్తి, తీన్మార్, ఖలేజా సినిమాలకు సంగీతం అందించాను. ఈ మూడూ ఆడియో పరంగా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నా పని నేను సక్రమంగా పూర్తి చేశాను. అయితే ఆ సినిమాలు ఆడలేదు. ఈ మూడు సినిమాలు ఆడకపోవడంతో నా పాత్ర ఏంటి? ఈ మూడు సినిమాల విషయంలో నా తప్పేంటి? నాకు ఇప్పటికీ అర్ధం కాదు, ఉన్నట్టుండి నాకు అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయో” అని ఆవేదన వ్యక్తం చేసాడు మణిశర్మ.
ఇక ప్రస్తుతం మణిశర్మ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే ఆడియో ఇచ్చిన మణిశర్మకు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పాటు దాదాపు 10 సినిమాల వరకూ మణిశర్మ పనిచేస్తున్నాడు. ఈ సినిమాలతో మణి రేంజ్ మళ్ళీ పూర్తి స్థాయిలో పెరగాలని ఆశిద్దాం.
632435 38516I will appropriate away grab your rss feed to remain up to date on any succeeding articles you may write 611754
52757 851992This really is a excellent topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the best to submit though. Ill take a look around your website though and submit something else. 155673
542445 626657Some truly good content on this web site , appreciate it for contribution. 792637