Switch to English

‘కన్నప్ప’ షూటింగ్‌లో గాయపడ్డ మంచు విష్ణు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

డైనమిక్ స్టార్ విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డాడని, దీంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ కన్నప్ప స్థాయి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి అనుకోని ఘటన ఎదురైంది.

యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారాం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

అమరావతి ప్రజలను అవమానిస్తారా.. ఇదేనా మీ సంస్కారం..

'అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని'.. సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన డిబేల్ లో వినిపించిన పదం ఇది. మొన్న సీఎం చంద్రబాబు వన మహోత్సవంలో పాల్గొని అమరావతి అంటే దేవతల...

అనుకున్న డేట్ కే వస్తున్న తమ్ముడు.. త్వరలోనే ట్రైలర్..

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ల‌య‌, స‌ప్త‌మీ గౌడ‌,...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో బాగా...

‘కన్నప్ప’ మూవీ శివుడి ఆజ్ఞ.. మోహన్ బాబు, విష్ణు ఎమోషనల్..

తాము కన్నప్ప మూవీని తీయడం శివుడి ఆజ్ఞ అని మంచు మోహన్ బాబు, విష్ణు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. మోహన్ బాబు,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...