‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’ ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,630FansLike
57,764FollowersFollow

ఎస్‌.ఆర్‌.పి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేవతిగారి మాటల్ని బట్టి చూస్తే సోసైటీకి సంబంధించిన చిత్రంగా అనిపించింది. 5 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడాలి’’ అని అన్నారు.

నటి దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ..
బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లా.. సక్సెస్‌ఫుల్‌ గా చదువు పూర్తి చేశా. ఎంబీఏ డాక్టరేట్‌ చేశా. అక్కడొక కంపెనీ ప్రారంభించా. అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదు. అక్కడ నన్ను భరతమాత ముద్దు బిడ్డగా చూసేవారు. అక్కడ నన్ను గుర్తించడానికి కారణం మన దేశం. మన నడవడిక. మనం తల్లిదండ్రులు, గురువు, రుణం తీర్చుకుంటాం. సామాజిక రుణం అంటే దేశ రుణం మాత్రం మరచిపోతాం. దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలున్నాయి. ఓ విలేజ్‌ని అడాప్ట్‌ చేసుకున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ స్కూల్‌తో సమానంగా అభివృద్ధి చేశా. నా సంపదలో 20 శాతం సోసైటీ కోసం తీసేశా. ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. జనాల్లో మార్పు కోసం ఈ పని చేస్తున్నా. ఏడేళ్లగా నేను చేస్తున్న నా సేవలను గుర్తించి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చింది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జెడ్‌పి ఛైర్‌పర్స న్ శ్రీమతి సునీత మహేందర్‌ రెడ్డి ప్రొటోకాల్‌తో వచ్చి నన్ను సత్కరించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించింది. సినిమా అనేది సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ సినిమా ప్రారంభించా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుంది. యువతకు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇది పొలిటికల్‌ సినిమా కాదు.. పబ్లిక్‌ మూవీ. ప్రపంచంలో ఇండియా అనేది చాలా గొప్పది అని చెప్పాలి. అదే నా గోల్‌. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని అన్నారు.

సినిమా

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

Rishab Shetty: ‘పెద్ది’ ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

Rishab Shetty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సందడి మొదలైంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ట్రైలర్...

Karuppu: ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన కరుప్పు టీమ్.. కారణమిదే

Karuppu: తమిళ హీరో సూర్య నటించిన సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడుగా విడుదలైంది. ఇటివల విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్లో అత్యధిక...

Jr.Ntr Birthday Special: ‘పాత్రేదైనా పరకాయప్రవేశమే..’ ఎన్టీఆర్ నటనలో స్పెషల్

Jr.Ntr Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ఉన్న సినిమాల్లో ఆయన నటనకి ఎక్కువ మార్కులు పడుతూంటాయి. కారణం, నటనలో ఇంటెన్సిటీ. కళ్లలో తీక్షణత, డైలాగ్...

మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి అరుదైన కల్ట్ సినిమా పెద్ది: రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు...

రాజకీయం

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వైఫల్యమే టీడీపీ ఓటమికి కారణమైందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన Y. S. Vivekananda Reddy హత్య కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే కొనసాగుతోంది. అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన రాజకీయ...

రోడ్ల పనుల నుంచి గ్రీన్ షాపుల వరకు పూర్తి పారదర్శకత ఉండాలి: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి,...

ఎక్కువ చదివినవి

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

Rishab Shetty: ‘పెద్ది’ ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

Rishab Shetty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సందడి మొదలైంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ట్రైలర్ కట్ లో రామ్ చరణ్ చూపిన...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...