ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తెలిపారు. హ్యాకర్స్ తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసారని.. పాస్ వర్డ్ మార్చేందుకు కూడా వీలులేకుండా పోయిందని అన్నారు. ట్విట్టర్ కూడా ఈ విషయంలో సాయం చేయడంలేదని ఎవరైనా సాయం చేయాలని నెటిజన్లను కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఖుష్బూ ట్విట్టర్ ను హ్యాకర్లు హ్యాక్ చేయడం ఇది రెండోసారి. హ్యాకర్లు ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ పేరును మార్చేయడమే కాదు.. ఆమె ప్రొఫైల్ పిక్ ను కూడా మార్చేశారు. ఆమె పోస్టులు కూడా డిలీట్ అయ్యాయి. 2020 ఏప్రిల్ నెలలో కూడా ఓసారి ఆమె అకౌంట్ హ్యాక్ కు గురైంది. తన అకౌంట్ ను సస్పెండ్ చేస్తామంటున్నారని.. సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే ధన్యవాదాలు తెలుపుతానని ఇన్ స్టా అకౌంట్ లో తెలిపారు.
999106 622873Hello! Someone in my Facebook group shared this website with us so I came to look it over. Im surely enjoying the info. Im book-marking and will likely be tweeting this to my followers! Outstanding weblog and superb style and design. 704971
533461 583530A really intriguing examine, I could not concur completely, but you do make some really valid points. 188151
889577 382798Wonderful post, Im searching forward to hear a lot more from you!! 356118