Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఈ దోపిడీ మీకర్థమవుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

కుప్పలు తెప్పలుగా సలహాదారులు.. ఎడా పెడా నామినేటెడ్ పోస్టులు.. ఇవన్నీ ప్రజల్ని ఉద్ధరించేయడానికేనా.? ఛాన్సే లేదు. ఈ తరహా పోస్టులన్నీ, రాజకీయ నిరుద్యోగుల కోసమే. ఔను, ఆయా రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చే క్రమంలో ఆయా నాయకులకు బోల్డన్ని హామీలు ఇస్తుంటాయి. వాటిని నిలబెట్టుకోవడం కోసం అడ్డగోలు విధానాలకు తెరలేపుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో వున్నా అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మరింతగా దిగజారిపోయింది.

రికార్డు స్థాయిలో ఉప ముఖ్యమంత్రులు.. రికార్డు స్థాయిలో సలహాదారులు.. రికార్డు స్థాయిలో టీటీడీ బోర్డు సభ్యులు.. ఔను, అన్నీ రికార్డు స్థాయిలోనే.! వీటిల్లో అన్నిటినీ తప్పు పట్టేయలేం. కానీ, చాలావాటిని తప్పు పట్టి తీరాల్సిందే. ఎందుకంటే, ఆయా పోస్టుల కోసం ప్రభుత్వం అదనంగా వెచ్చించే ధనం.. ప్రభుత్వ ఖజానా నుంచే కదా.? ప్రభుత్వ ఖజానా అంటే, అది ప్రజల కోసం ఉపయోగపడాల్సింది కదా.?

ఇవే కాదు, మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, రెండో వైస్ ఛైర్మన్.. ఇలా కొత్త కొత్త పోస్టులూ తెరపైకొస్తున్నాయి. రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకన్ని నిదర్శనం ఇంకేం కావాలి.? ఒక్క జీవోతో అయినవారికి అడ్డగోలుగా పదవులు కట్టబెట్టేయొచ్చని అధికారంలో వున్నవారు ఆలోచిస్తుండడంతో ఇలాంటి విచిత్రాలే చోటు చేసుకుంటాయ్. రెండో వైస్ ఛైర్మన్లతో ఆగుతుందా.? పదో వైస్ ఛైర్మన్, పాతికో వైస్ ఛైర్మన్ వరకూ ముందు ముందు వెళుతుందా.? అంటే, ఇప్పుడే చెప్పలేం.

ఈ ట్రెండ్ చూస్తోంటే, కొత్త చట్టాలు చేసేసి.. ఓ పాతిక మంది ఉప ముఖ్యమంత్రులు, ఓ వంద మంది మంత్రులు.. ఇలాంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో చూడబోతున్నామేమో.? జనాన్ని కులాల పేరుతో విభజించి, వేర్వేరు కార్పొరేషన్లు పెట్టేసి, వాటికి మళ్ళీ పదవుల జాతర.. అక్కడా రాజకీయ కంపు సర్వసాధారణమే. ‘సామాజిక న్యాయం.. మాతోనే సాధ్యం..’ అని జనాన్ని ఏమార్చేందుకు మీడియా సంస్థలెలాగూ అధికారంలో వున్న పార్టీలకు అండగా వుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

ఆటో వాలా కార్పొరేషన్, బస్ డ్రైవర్ల కార్పొరేషన్, లారీ డ్రైవర్ల కార్పొరేషన్.. ఇలాంటివి కూడా ముందు ముందు చూడబోతున్నామేమోనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజలకు వందలు, వేలు విదిలించి.. అయినవారికి, ఆయా పదవుల్ని కట్టబెట్టడం ద్వారా లక్షలు, కోట్లు కొల్లగొట్టేస్తున్నారు పాలకులు. దీన్నే ఘనమైన పాలన.. అంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమం అనే ‘కళ్ళగంత’ కట్టేసి, పాలకులు ఆడుతోన్న వికృత రాజకీయ క్రీడ.. రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తోందన్న ఆవేదన ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...