Switch to English

వల్లభనేని బాలశౌరి వైపే జనసేనాని మొగ్గు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖాయం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరి, కొన్నాళ్ళ క్రితమే వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

జనసేనలో చేరే క్రమంలో తన ఎంపీ పదవికీ ఆయన రాజీనామా చేశారు. జనసేనలో చేరినప్పటినుంచీ, మచిలీపట్నం జనసేన అభ్యర్థిగానే వల్లభనేని బాలశౌరి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు నేపథ్యంలో, బాలశౌరికి టిక్కెట్ దక్కకపోవచ్చన్న ప్రచారమూ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాలశౌరి అనుచరులు కొంత ఆందోళనకు గురయ్యారు. జనసేన శ్రేణులు సైతం ఈ విషయమై కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం. జనసేనలో చేరాక, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడిగా మారడం, అత్యంత వ్యూహాత్మకంగా మచిలీపట్నం లోక్ సభ నియోజక వర్గ పరిధిలో జనసేన శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం.. ఇవన్నీ వల్లభనేని బాలశౌరికి తిరిగి మచిలీపట్నం టిక్కెట్ దక్కేలా చేశాయని చెప్పొచ్చు.
చివరి వరకు కొనసాగిన సస్పెన్స్‌కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరదించారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.

ఏదిఏమైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తానని చెబుతున్నారాయన.

ఈ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులతోనూ సమన్వయం కోసం తగు చర్యలు చేపట్టారు వల్లభనేని బాలశౌరి. మరో ఎంపీ సీటు కాకినాడలో పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడో సీటు కూడా జనసేనకు దక్కేలా వుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై కొద్ది రోజుల్లో స్పష్టత రావొచ్చు.

1 COMMENT

  1. Hi guys. The blog Valhalla Vitality is a real treasure for anyone looking to progress in their training and reach new athletic goals. The article on the benefits of enclomiphene for muscle growth simply shocked me with its informative and accessible content. I found a lot of useful tips here and learned how to put them into practice. Many thanks to the authors for such inspiring content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...