ఓ భారీ బహిరంగ సభ పెట్టి, ఓ ఐదు నుంచి పది లక్షల మందిని పోగేస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్.. వందల కిలోమీటర్లు.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్.. ఓ చిన్న చిరునవ్వు, ఓ చిన్న భేటీ.. ఓ చిన్న కార్యక్రమం ద్వారా కూడా సాధించొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు.
నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొన్నీమధ్యనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, సాటి విపక్ష నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో భేటీ అయ్యారు.
కొన్నాళ్ళ క్రితం విశాఖలో జనసేన అధినేత పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న దరిమిలా, అప్పట్లో పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పుడు చంద్రబాబు తన దగ్గరకు వచ్చారు గనుక, ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు.
అంతే, మీడియా మోత మోగిపోయింది. సోషల్ మీడియాలో వందలు, వేలు, లక్షల ‘పెయిడ్ కామెంట్లు’ పోటెత్తాయ్.. అధికార వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ. సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయ్. అన్న కోణంలో ఓ వైసీపీ మంత్రి గుస్సా అయ్యాడు. ఇంకొకాయన దత్త తండ్రి, దత్త పుత్రుడు.. అంటూ మొరిగాడు.
అసలేముంది చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీలో. ఇద్దరు వ్యక్తులు.. పోనీ, రెండు పార్టీల అధినేతలు భేటీ అయితే, ‘వైనాట్ 175’ అనే ధీమాతో వున్న పార్టీ, లక్షలు.. కోట్లు ఖర్చు చేసి మరీ, ఆ ఇద్దరి భేటీపై దుష్ప్రచారానికి తెరలేపాలి.?
వైసీపీకి ఓటమి భయం లేకపోతే, చంద్రబాబు – పవన్ భేటీపై అసలు కంగారు పడాల్సిన పనే లేదు. ఆ మాటకొస్తే, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ‘కుక్కల బండి గేట్లు తెరిచినట్లుగా.. వైసీపీ కుక్కలు వ్యవహరించాయ్..’ అనే విమర్శని వైసీపీ ఎందుకు ఎదుర్కోవాలి.?
బహుశా ఇలా వైసీపీని ర్యాగింగ్ చెయ్యడానికేనేమో.. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా తనదైన వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంటే, ఎన్నికలు సమీపించేసరికి.. అధికార వైసీపీలో ఇంకెలాంటి భయాందోళనలు నెలకొంటాయో ఏమో.!
బొల్లి ముసలి నక్క , చిత్త కార్తె కుక్క పావలా గాడిని ఎవ్వరు లెక్క చెయ్యరు. బొల్లి గాని గుత్త నాకనీకి పావలాగాడు పోయాడని జనం అంతా అనుకొంటున్నారు
626330 731639Extremely finest individuals messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations really should normally our own gold colored dominate in presenting and public speaking, which is to be personal interests home. very best man speach 270094
706155 306346obviously like your website but you have to test the spelling on quite a few of your posts. 901631