Jahnvi: దివంగత నటి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆమె చేసిన సినిమాల్లో విజయాల సంఖ్య తక్కువే అయినా.. అభినయం పరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం జాన్వి.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వి తారక్ మీద ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. ‘ తారక్ తో సినిమా చేయాలనేది నా కల. అందుకోసం దేవుని రోజు ప్రార్థించేదాన్ని . ఇప్పుడు అది త్వరలోనే తీరబోతోంది. అందుకోసం రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. తనతో కలిసి పని చేయడానికి ఎంతో ఆత్రుతగా ఉన్నాను. ఈ విషయాన్ని ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాను. ఇప్పటికైతే డైరెక్టర్ కు రోజు టచ్ లో ఉన్నాను. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మళ్ళీ చూశాను. అందులో ఎన్టీఆర్ తేజస్సు నన్ను బాగా ఆకర్షించింది. ఆయనతో కలిసి పనిచేయడం అనేది నా జీవితంలో చోటు చేసుకున్న అత్యంత సంతోషకర పరిణామాల్లో ఒకటి’ అని చెప్పుకొచ్చింది. అయితే , ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘ తారక్ పై అంతా అభిమానం ఏంటి. మేము కూడా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ 30’ విషయానికి వస్తే ఈ చిత్ర పూజా కార్యక్రమం ఈనెల 23న జరగనుంది. ప్రస్తుతం జాన్వి దీనితో పాటు తో మరో రెండు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. వరుణ్ ధావన్ తో ఓ సినిమా చేస్తుండగా.. క్రీడా నేపథ్యం ఉన్న ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ లోను తనే హీరోయిన్.