Switch to English

FCUK మూవీ రివ్యూ – గుడ్ స్టోరీ పాయింట్, కానీ కంటెంటే వీక్.!

Critic Rating
( 1.75 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow
Movie FCUK
Director విద్యసాగర్ రాజు
Producer కెఎల్ దామోదర్ రెడ్డి
Music భీమ్స్ సిసిరోలియో, జీవన్
Run Time 2 గంటల 49 నిమిషాలు
Release ఫిబ్రవరి 12, 2021

మూవీ టైటిల్ గా ‘FCUK’ అని చూడగానే అడల్ట్ కామెడీలా ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది. కానీ FCUK అంటే ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’. ఈ నలుగురు చుట్టూ తిరిగే కథే ఈ సినిమా. టైటిల్ కి తగ్గట్టుగానే ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఫాదర్ గా జపతి బాబు నటిస్తే, రామ్ కార్తీక్ – అమ్ము అభిరామిలు లీడ్ పెయిర్ గా నటించారు. బేబీ సహ్రాషిత చిట్టిగా కనిపించింది. మరి ఈ అడల్ట్ రొమాంటిక్ కామెడీ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

మన ఫణి భూపాల్(జగపతి బాబు) ఓ మిడిల్ ఏజ్డ్ ప్లే బాయ్. తన క్యారెక్టర్ కి తగ్గట్టే కండోమ్స్ బిజినెస్ చేస్తుంటాడు. అతని కొడుకే మన హీరో కార్తీక్(రామ్ కార్తీక్). కానీ కార్తీక్ ఫాదర్ క్యారెక్టర్ కి పూర్తిగా విరుద్ధంగా ఉంటాడు. కుర్రాడు కదా అనుకోకుండా ఒక రోజు ఉమ(అమ్ము అభిరామి)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే ఉమకి ఎంగేజ్మెంట్ అయ్యుంటది కానీ పెళ్లి లోపు ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలని ట్రై చేస్తున్న టైంలో ఫణి భూపాల్ చేసిన ఓ పని వలన కార్తీక్ పై ఉమకి ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఓ రోజు కార్తీక్ ఫాదర్ కి యాక్సిడెంట్ అని కాల్ వస్తుంది వెళ్లి చూస్తే ఫాదర్ తో పాటు ఓ చిన్న పాప కూడా ఉండడం చూసి షాక్ అవుతాడు. అలా వారి లైఫ్ లోకి వచ్చిన పాపతో వాళ్ళు పడ్డ కష్టాలు ఏమిటి? ఆ పాప వల్ల వారి లైఫ్స్ ఎలా మారాయి? ఇంతకీ ఎవరా పాప? ఆ పాపకి ఫణి భూపాల్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ పాప కార్తీక్ – ఉమలని కలిపిందా? లేదా? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

తెరపై కనిపించిన అందరూ వారి వారి పాత్రల్లో బాగా చేశారనే చెప్పాలి. జగపతి బాబు మిడిల్ ఏజ్డ్ ప్లే బాయ్ గా యూత్ మొత్తం షాక్ అయ్యేలా యాటిట్యూడ్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, స్టైలింగ్ తో సూపర్బ్ అనిపిస్తాడు. అలాగే పెర్ఫార్మన్స్ లో కూడా అన్ని ఎమోషన్స్ ని బాగా చేశారు. ఇక రామ్ కార్తీక్ కూడా కూల్ లుకింగ్ పాత్రలో బాగా చేసాడు. తమిళ్ లో ఆల్రెడీ మంచి పేరున్న అమ్ము అభిరామికి తెలుగులో హీరోయిన్ గా మొదటి సినిమా. తన పాత్రలో క్యూట్ గా కనిపించడమే కాకుండా మంచి ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ కి కనెక్ట్ అయ్యింది. మాస్టర్ భరత్, రామ్ ప్రసాద్ ల చేత చెప్పించిన కొన్ని వన్ లైనర్స్ నవ్వు తెప్పిస్తాయి కానీ ఎక్కువగా నవ్వించలేకపోయారు.

తెర వెనుక టాలెంట్..

తెరవెనుక టాలెంట్స్ లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన భీమ్స్ సిసిరోలియో మరియు జీవన్ కి.. భీమ్స్ పాటలు బాగున్నాయి, అలాగే జీవన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూనే వచ్చాడు. ఆ మ్యూజిక్ వల్లే పలు సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇకపోతే శివ జి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎమోషన్స్ ని రీచ్ చేయడంలో విజువల్స్ హెల్ప్ అయ్యాయి. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ బాగుంది కానీ లెంగ్త్ మాత్రం చాలా కట్ చేసి ఉండచ్చు. అలా కట్ చేయకపోవడంతో చాలా చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. జేకే మూర్తి ఆర్ట్ వర్క్ బాగుంది. ఆదిత్య, కరుణాకర్ డైలాగ్స్ డీసెంట్ అనిపిస్తాయి. ఇంకా ఫన్ డైలాగ్స్ రాయడానికి ఛాన్స్ ఉంది కానీ మిస్ అయ్యారు అని చెప్పాలి.

ఇక డైరెక్టర్ విద్యాసాగర్ రాజు విషయానికి వస్తే.. ఆయన కథ కోసం ఎంచుకున్న పాయింట్ మంచిది అండ్ కాస్త బోల్డ్ పాయింట్ కూడాను. ఆ పాయింట్ ని అంతే బోల్డ్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఆయా తీసుకున్న బోల్డ్ పాయింట్ ని ఏదో పద్దతిగా చెప్పాలని ట్రై చేయడం వలన కథలో ఆ పాయింట్ ఇంపాక్ట్ తెలియదు. అలా కథని ఆడియన్స్ కి ఎంగేజ్ చేయలేకపోయారు. ఇకపోతే దాదాపు 169 నిమిషాల కథనంలో సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ కానీ, ఆసక్తి కలిగించే అంశం కానీ ఒక్కటీ లేకపోవడం వలన బోర్ కొట్టేస్తుంది. ప్రతి సీన్ ప్రేక్షకులు ఊహించేయగలరు. డైరెక్టర్ గా నటీనటుల నుంచి నటనని, క్రాఫ్ట్స్ నుంచి మంచి వర్క్ తీసుకోగలిగాడు కానీ తను అనుకున్న కథని ఆసక్తికరంగా చెప్పడంలో, అనుకున్న కామెడీని పూర్తిగా తెరపై ప్రెజంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.శ్రీ రంజిత్ మూవీస్ కెఎల్ దామోదర ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– జగపతి బాబు లుక్ అండ్ పెర్ఫార్మన్స్
– స్టోరీలో కీ పాయింట్
–  మ్యూజిక్
– అక్కడక్కడా కొని నవ్వులు

బోరింగ్ మోమెంట్స్:

– ఆకట్టుకోలేకపోయింది పూర్తి కథ
– ఆసక్తిగాలేని కథనం
– అనుకున్న కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం
– వామ్మో అనిపించే లెంగ్త్
– సాగదీసిన ఎడిటింగ్
– అనుకున్న ఎమోషన్ ని కన్వే చేయలేకపోవడం

విశ్లేషణ:

‘FCUK’ టైటిల్ తోనే ఇదొక బోల్డ్ పాయింట్ అండ్ అంతే స్ట్రాంగ్ గా చెప్పాం అనేలా ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ కి ముందు క్రియేట్ చేసుకున్న కాస్త క్రేజ్ ని ఈ సినిమా రిలీజయ్యాక నిలబెట్టుకోలేకపోయింది. మంచి పాయింట్ అనుకున్నప్పటికీ ఆ పాయింట్ ని చెప్పాల్సిన స్టైల్ లో చెప్పకపోవడం వలన నటీనటుల నటన ప్రతిభ, టెక్నికల్ టీం ఎఫర్ట్స్ అన్నీ వృధా అయ్యాయని చెప్పచ్చు. ‘FCUK’ ఒక అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ అవ్వాలి కానీ అక్కడక్కడా అడల్ట్ కంటెంట్ కనిపించినా కామెడీ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా కనిపించి బోర్ కొట్టిస్తుంది.

చూడాలా? వద్దా?: జగపతి బాబు ఫ్యాన్ అయితే ఓకే లేదంటే లైట్ తీసుకోవచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 1.75/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...