Switch to English

గంటా, అవంతి.. ఒకే వేదికపైన.. ఏం జరుగుతోందబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే వున్నారా.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. సాంకేతికంగా చూసుకుంటే ఆయన ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేగానే వున్నారు. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, స్పీకర్ తమ్మనేని సీతారాంకి రాజీనామా లేఖను పంపిన విషయం విదితమే.

తాజాగా మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ సమక్షంలో.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తూ, ఆ లేఖని మీడియాకి చూపించారు గంటా శ్రీనివాసరావు. మరోపక్క, వైసీపీ నేత.. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి వేదికను పంచుకున్నారు గంటా శ్రీనివాస్.

ఒకప్పుడు గంటా, అవంతి.. తెలుగుదేశం పార్టీలో మిత్రులే. గంటా, అవంతి కలిసే వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారుగానీ, గంటా చేరిక ఆలస్యమయ్యింది.. అవంతికి అదృష్టం కలిసొచ్చింది. ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి గెలిచారు. అవంతి మంత్రి అయ్యారు. ఒకవేళ గంటా, వైసీపీలో చేరి వుంటే అవంతికి మంత్రిగా ఛాన్స్ దక్కి వుండేది కాదేమో.

పార్టీ ఫిరాయించేందుకు గంటా చాలా ప్రయత్నాలు చేస్తే, అవంతి ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నారు కూడా. కానీ, పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. సీపీఐ నారాయణ, అటు మంత్రి అవంతి, ఇటు మాజీ మంత్రి గంటాను కలిపారు. ఇద్దరూ కలిసి చంద్రబాబు, వైఎస్ జగన్‌ని కలపాలనీ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చేలా చూడాలంటూ గంటా, అవంతిలకు సూచించారు నారాయణ.

ఆత్మీయ పలకరింపులు లేకపోయినా, మొహమాటంగానే అయినా గంటా, అవంతి కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖ నగరంలో ఈ కలయిక రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. గంటాను అవంతి, వైసీపీలోకి ఆహ్వానిస్తారా.? లేదంటే, ఇద్దరూ కలిసి టీడీపీ వైపు వెళతారా.? వేరే ఆలోచన ఏమైనా ఈ ఇద్దరూ చేస్తారా.? అంటూ విశాఖలో అవంతి – గంటా కలయికపై ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది.

అయితే, ఉద్యమ వేదికలపై ఇలాంటి కలయికలు మామూలే. ఆ మాటకొస్తే, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ ఇలాంటి కలయికలు జరుగుతుంటాయి. మధ్యలో ఆయా పార్టీల మద్దతుదారులే వెర్రి వెంగళప్పలయిపోతుంటారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...