Switch to English

ఇంటర్వ్యూ: `ఇష్క్` మూవీ చూస్తున్నంత సేపు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది – ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌.

`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో క‌లిసి ‘ఇష్క్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత తెలుగులో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌కుడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదల సంద‌ర్భంగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తో ముచ్చ‌టించిన విశేషాలు.

నాట్ ఏ లవ్ స్టోరీ అని టాగ్ లైన్ పెట్టిన ఇష్క్ మూవీ ఎలా ఉండబోతుంది?

ఒక కొత్త సబ్జెక్ట్ తో రూపొందిన సినిమా ఇది. ఈ కథకు త‌ప్ప‌కుండా ప్ర‌తి ఆడియన్‌ రిలేట్‌ అవుతారు. సినిమాలో ప్రతి సీన్‌ చాలా ఆసక్తికరంగా, నెక్ట్స్‌ సీన్‌లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్ష‌కుల ‌మైండ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఆడియ‌న్స్ తప్పకుండా థ్రిల్ ఫీల‌య్యే సినిమా ఇది.

ఇష్క్ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

ఇష్క్ లో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. త‌ను సెల్ఫ్ రెస్పెక్ట్‌ ఉన్న కాలేజ్‌ గాళ్‌. ‘చెక్‌’ సినిమాలో నా స్క్రీన్‌ ప్రజెన్స్‌ టైమ్‌ చాలా తక్కువ కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఫుల్‌ లెంగ్త్‌ ఉంటుంది.

మీ కో స్టార్ తేజ సజ్జతో వర్కింగ్ ఎలా ఉంది?

తేజ సజ్జా మంచి కో స్టార్‌. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్‌. సో..సెట్స్‌లో చాలా ఫన్‌ ఉండేది. తెలుగు డైలాగ్స్‌ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్‌ చేశాడు.

మొదటి సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజు గురించి మీ మాటల్లో

దర్శకుడిగా ఎస్‌ఎస్‌ రాజుగారికి ఇది ‌సినిమా తొలి సినిమా అయినప్పటికీ చాలా ఫోకస్డ్ గా చేశారు. క్యారెక్టర్‌ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ చేయమని చెప్పి నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు.

ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది?

ఈ ఆఫ‌ర్ నాకు సడన్‌గా వ‌చ్చింది. ‌పెద్దగా ప్లాన్‌ కూడా చేసుకోలేదు. మెగాసూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ వంటి మంచి బ్యానర్‌లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్‌ అవుతుందని వెంటనే `ఇష్క్`‌ సెట్స్‌లో జాయినైపోయాను.

సెట్లో తెలుగు టఫ్ అనిపించిందా?

తెలుగు డైలాగ్స్‌లో పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇష్క్‌ సినిమా చేసేప్పుడు టీమ్‌ నాకు హెల్ప్‌ చేశారు. ముందురోజే డైలాగ్స్‌ తీసుకుని నేను ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్‌ అయ్యింది.

అంత క్రేజ్ తెచ్చిన మొదటి సినిమా ఫెయిల్యూర్ ని ఎలా తీసుకున్నారు?

మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్‌ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్‌ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్‌ ఇంటెన్స్‌ అండ్‌ డ్రమటిక్‌గా ఉంటుంది.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?

సందీప్‌కిషన్‌గారి నెక్ట్స్‌ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్క‌ర్ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

బ్రహ్మాస్త్ర నుండి దేవ దేవ…

రణ్బీర్‌ కపూర్‌ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అమితాబచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన కుంకుమల పాట సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే....

బంగ్లాదేశ్ మరో శ్రీలంక కానుందా..!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏ పరిస్థితులకు దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. అక్కడి పరిస్థితుల నుండి ప్రతి దేశం కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. శ్రీలంగా చేసిన తప్పిదాలను ఏ దేశం...

రాశి ఫలాలు: బుధవారం 10 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:27 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము:పూర్వాషాఢ ఉ.8:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: ప్రీతి...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ: రామ్మోహన్ నాయుడు

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ అవుతుందనే ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయడు అన్నారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని.. మహిళల...