Switch to English

వాలంటీరు సేవకుడా లేక ఉద్యోగస్థుడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో అమలులో ఉన్న వాలంటీరు వ్యవస్థలో ఉన్న లోపాలపై టీడీపీ మాట్లాడుతుంటే, దానికి టీడీపీ వ్యతిరేకమన్నట్లుగా విమర్శిస్తున్నారని నక్క ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సొంత పత్రికలో వాలంటీరీ వ్యవస్థకి టీడీపీ వ్యతిరేకం అన్నట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను బలోపేతం చేసి, ఆ వ్యవస్థల్నీ బలోపేతం చేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేయాలని టీడీపీ ఆకాంశిస్తుందని ఆయన తెలిపారు. వాలంటీర్లలో 95% తమ పార్టీ వాళ్లే అని వైసీపీ నాయకులైన విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు బహిరంగంగానే వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ సభలకి జనాన్ని తరలించడానికి వాలంటీరులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. దీనితో పాటు వీరిలో కొంత మంది ద్వారా అన్యాయాలను, అక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లలోనే కొందరు అసాంఘిక శక్తులుగా మారి మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారని వివరించారు.

వాలంటీర్లు చేసిన సర్వేలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆధారాలతో సహా ఈ వివరాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రజల వ్యక్తిగత విషయాలను సేకరించి జగన్ ఎన్నికలకు ఉపయోగపడేలా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వాలంటీరు వ్యవస్థని అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకులు చేస్తున్న హవాలా ఉదంతాలు గతంలో వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాలంటీరు సేవకుడా లేక ఉద్యోగస్థుడా అని తేల్చాల్సిన బాధ్యత జగన్ మీదే ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే గౌరవ వేతనం సరిపోక కొంత మంది వాలంటీరులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థని సంపూర్ణంగా తీర్చిదిద్ది ప్రజలకి సేవలు అందించే విధంగా నిర్ణయాలను తీసుకుంటామని వివరించారు.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

‘నా సేన కోసం నా వంతు’గా జనసేనకు రూ.48 లక్షల విరాళం: నాగబాబు ముందడుగు

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనసేన పార్టీకి మరో కీలక ఆర్థిక సహాయం అందింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను జనవరి 16న విడుదల...