Court: లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బాధితురాలిని 10 సెకన్లే తాకాడని నిర్దోషిగా తేల్చిందో కోర్టు. ఇటలీ (Italy) రాజధాని రోమ్ (Rome) లో జరిగిన కేసు వివరాల్లోకి వెళ్తే.. రోమ్ లో 17ఏళ్ల విద్యార్ధినిని అదే స్కూల్లో కేర్ టేకర్ అయిన 66ఏళ్ల ఆంటోనియో అవోలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్ధిని గతేడాది ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసింది.
స్కూలు మెట్లెక్కుతుంటే ఆంటోనియో తన వెనుక భాగంపై చేతులతో తడిమి తన లోదుస్తులను కిందకి లాగేందుకు ప్రయత్నించాడని.. తనను పెకెత్తాడని.. గట్టిగా అరవడంతో జస్ట్ జోక్.. అంటూ వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచరాణ చేపట్టగా నిందితుడు నిజమని అంగీకరించాడు.
అయితే.. కోర్టులో తాను సరదాగా అలా చేశానని తెలిపాడు. దీంతో కోర్టు అతడిని నిర్దోషిగా పేర్కొంది. ఆంటోనియో కామంతో అలా చేయలేదని.. బాలికను కేవలం 5-10 సెకన్లు మాత్రమే తాకాడు కాబట్టి నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించి అతనిపై అభియోగాలను కొట్టేసింది. కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.