భవిష్యత్ చెప్పడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎప్పుడో జరగబోయే అంశాల్ని ముందుగా ఊహించి చెప్పడం కుదురుతుందా? జ్యోతిష్యం నిజమవుతుందా? అంటే ఇది ఎంతకీ ఎడతెగని అంశం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. కొందరు జ్యోతిష్యాన్ని నమ్మితే.. మరికొందరు మాత్రం తేలిగ్గా తీసిపారేస్తారు. అయితే, బాలాజీ హాసన్ అనే జ్యోతిష్యుడు ఆరు నెలల క్రితమే క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకుంటారో చెప్పాడు.
ఏదో జట్టు గెలుస్తుందని మనం కూడా చెబుతాం.. ఇందులో విశేషం ఏమిటంటారా? ఏయే జట్లు సెమీ ఫైనల్ కు వెళతాయి? కప్ ఎవరు కొడతారు? మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు గెలుచుకుంటారో కూడా చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ ఏడాది జనవరిలో ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో అతడు ఈ విషయాలు వెల్లడించాడు. అయితే, వాటిని అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయి ఇంటిముఖం పట్టడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
చర్చా కార్యక్రమంలో భాగంగా బాలాజీ హాసన్ ను 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఎవరు గెలుచుకుంటారని యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ఇది చాలా కష్టమైన అంశమేనని, అయినా చెబుతానని తడుముకోకుండా చాలా అవలీలగా జవాబు చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచ కప్ గెలుచుకోని జట్టే ఈసారి విజేత అవుతుందని పేర్కొన్నాడు. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్ కు చేరతాయని.. భారత జట్టు ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్ తో సెమీఫైనల్ ఆడుతుందని చెప్పాడు. కప్ మాత్రం న్యూజిలాండ్ గెలుచుకుంటుందని వెల్లడించాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కివీస్ ప్లేయర్ విలియమ్సన్ గెలుచుకుంటాడని పేర్కొన్నాడు.
అచ్చం బాలాజీ చెప్పినట్టుగానే సెమీస్ కు భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేరాయి. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరింది. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రేస్ లో విలియమ్సన్ ముందున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేస్తే.. అతడే టాపర్ అవుతాడు. ఇలా బాలాజీ హాసన్ చెప్పిన అన్ని అంశాలూ అలాగే జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఫేవరేట్ గా ఉన్నప్పటికీ, బాలాజీ చెప్పినట్టు కివీస్ గెలిస్తే.. అతడి జ్యోతిష్యానికి తిరుగు లేనట్టే.
Diese Richtlinien kann Entscheidend in Entscheidung, ob Sie sollte melden Sie sich an das Casino oder finden woanders bis genießen.
105194 269951We keep your page. Watch it offline once more soon. Really intriguing post. 178634
462831 328531Thankyou for all your efforts that you have put in this. quite fascinating information . 553523
3501 331344Dead written articles , Actually enjoyed reading . 860947