ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ సెన్సేషన్ సృష్టించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు అతను హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్. నాని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నిర్మించిన రెండో చిత్రమిది. మొదటి చిత్రం అ! తోనే అభిరుచి కల నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు నాని. మొదటి చిత్రం ఒక డిఫరెంట్ అనుభూతిని ప్రేక్షకులకు పంచింది. ఇప్పుడు రెండో సినిమా ద్వారా ఒక థ్రిల్లర్ ను నిర్మిచాడు. డా! శైలేష్ కోలను దర్శకుడిగా పరిచయమౌవుతున్న ఈ చిత్రం ఒక మిస్సింగ్ కేస్ చుట్టూ తిరిగే కథ అని ఇదివరకే టీజర్ ద్వారా అర్ధమయ్యేలా చేసారు.
ఇక ఇప్పుడు కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ ప్రకారం ఈ చిత్రంలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కు లోటు లేదని అర్ధమైపోతోంది. ప్రీతి అనే అమ్మాయి కనిపించకుండా పోతే ఆమె గురించి విక్రమ్ రుద్రరాజు అనే పాత్ర పోషిస్తున్న విశ్వక్ సేన్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, దాని వల్ల తన పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది. చివరికి ఏమైంది అన్న సస్పెన్స్ పాయింట్స్ చుట్టూ హిట్ ను అల్లినట్టు అర్ధమవుతోంది. సినిమా మొదటి నుండి చివరి వరకూ ఆద్యంతం అలరిస్తుందని చెబుతున్నారు హిట్ టీమ్.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 28న హిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నాని తన రెండో సినిమా ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
191737 287009You created some decent points there. I looked on the internet for that issue and located a lot of people will go in addition to with the internet website. 166388
760134 798616I was reading some of your content on this website and I feel this internet site is actually informative! Keep putting up. 824345
100971 614160Blogs ou really should be reading […]Here is a superb Weblog You might Find Interesting that we Encourage You[…] 51711