Switch to English

‘స్థానిక’ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో స్థానిక సమరానికి తెర లేవనుంది. జగన్ తొమ్మిది నెలల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలనే తలంపుతో ఉంది. జనసేన సైతం క్షేత్రస్థాయిలో బలపడటానికి ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని అధికార వైఎస్సార్ సీపీ పావులు కదుపుతోంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనేనే ఏపీ సీఎం జగన్ పయనిస్తున్నారు. ఒక్క లోక్ సభ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించిన కేసీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే తాను కూడా అవలంభించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ అప్పగించారు. ఎన్నికల్లో వారి పనితీరును బట్టే భవిష్యత్తులో పదవులు ఉంటాయని స్పష్టంచేశారు.

దీంతో వారంతా అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ తిరుగులేని విజయం నమోదు చేసింది.

తాజాగా జగన్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత వారిపైనే పెట్టారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల్లో విజయం సాధించే వరకు అన్ని అంశాలూ వారే చూసుకోవాలి. దీంతో అధికార పార్టీ నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. అసలే మంత్రుల మెడపై రెండున్నరేళ్ల నిబంధన వేలాడుతోంది.

ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారి పనితీరును రెండున్నరేళ్ల తర్వాత సమీక్షించి 70 నుంచి 80 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశమిస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రుల భవితవ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో పలువురు అమాత్యులు అప్పుడే రంగంలోకి దిగిపోయి గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు.

మరోవైపు ఎమ్మెల్యేలు సైతం తమకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చడం ద్వారా మంత్రి పదవి రేసులో ఉండాలని యోచిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫార్ములా ఏపీలో బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది.

సినిమా

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

అనుమతులు ఇవ్వటమే ఆలస్యం..’లొకేషన్’లో ఉంటాను.!

తమిళ నటుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీని స్టార్ గా మార్చిన బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా రిలీజై సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా...

బన్నిలా నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేనంటున్న బాలీవుడ్ హీరో.!

అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని...

బిగ్ వార్: బాలయ్య వ్యాఖ్యలపై సి.కళ్యాణ్ పేస్ వేల్యూ లేదంటూ కౌంటర్ అటాక్.!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రభుఖులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరిపారు....

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...