Switch to English

ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. భీమా చిత్రాన్ని గొప్పగా ఆదరించి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కథని నా దగ్గరకి తీసుకొచ్చి, సినిమాని అద్భుతంగా తీసి, ప్రేక్షకుల చేత ప్రశంశలు అందుకునేలా చేసిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు. సినిమాకి కావాల్సినదంత సమకూర్చి ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించి ఇంత మంచి అవుట్ పుట్ తెచ్చిన నిర్మాతలు రాధమోహన్, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో సినిమా చేసి చాలా కాలమైయింది. ఇందులో సెకండ్ హాఫ్ లో ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్వామీ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. థియేటర్స్ లో అదిరిపోయాయి. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి. ఫైట్స్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఎమోషన్ ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్ లో క్లాప్స్, విజల్స్ పడుతూనే వున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా చేశారు. రవి బస్రూర్ ఎక్స్ ట్రార్డినరీగా మ్యూజిక్ చేశారు. తన మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడనివారు తప్పకుండా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ..ఇంత మంచి ప్రాజెక్ట్ ని నా వద్దకు తీసుకొచ్చిన మా సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఇచ్చిన గోపీగారికి, హర్ష గారికి ధన్యవాదాలు. అజ్జు మంచి డైలాగ్స్ రాశాడు. ఆర్ట్ డైరెక్టర్ రమణ లంక సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డీవోపీ స్వామీ అద్భతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు విజువల్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారి పాత్ర అందరినీ అలరిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు గారు చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గోపీచంద్ గారితో పంతం సినిమా తర్వాత మా అనుబంధం అలానే కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించాం. సినిమా విజువల్స్ రిచ్ నెస్ తెరపై కనిపిస్తుంది. సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పంధన వస్తోంది” అన్నారు.

దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. భీమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పంధన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ప్రేక్షకుల కేరింతలు చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా అందరి టీం వర్క్. నిర్మాతలు శ్రీధర్, రాధమోహన్ గారికి ధన్యవాదాలు. ఎంతో గొప్ప ప్రోత్సహించి అద్భుతంగా పెర్ఫార్ చేసిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. భీమా, రామాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నమ్మిన నరేష్ గారికి ధన్యవాదాలు. తన పాత్రని చాలా మెరుగుపరిచారు. ఆడియన్స్ ఆ ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ గొప్పగా యాక్షన్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి” అని కోరారు.

డా. నరేష్ వికే మాట్లాడుతూ.. చాలా మంది ప్రేక్షకులు భీమా చూసి ఇంటర్వెల్ ఎక్స్ లెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ పెట్టారు. ప్రతి సినిమాకి ఈ రెండు చాలా కీలకం. ఇందులో విజయం సాధించిన దర్శకుడు హర్షకి అభినందనలు. సంక్రాంతి సినిమాల శివరాత్రి సినిమా వుంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ గారు చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్ కి హ్యాట్సప్. రాధమోహన్ గారు చాలా రిచ్ గా తీశారు. ప్రతిఒక్కరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇది. సినిమాలో పని చేసిన పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు” తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

సినిమా

హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ప్రేమ వెల్లువలో నాని, శ్రీనిధి..

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు పార్టులు వచ్చి మంచి హిట్...

ఏజ్ గ్యాప్ కామెంట్స్.. ఇచ్చి పడేసిన సల్మాన్..!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న కొత్త మాట. హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్.. స్క్రీన్ మీద అందంగా కనిపించేందుకు కొన్ని...

స్వప్న ఇంటర్వ్యూ.! భార్గవి ఆవేదన.! అసలేంటి కథ.?

వెబ్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్ నిర్వహణ.. వెరసి, ఐ-డ్రీమ్ గురించి చాలామందికి తెలిసే వుంటుంది. సదరు సంస్థ వైసీపీ కనుసన్నల్లో నడుస్తుంటుంది. వైసీపీ హయాంలో,...

ఆదిత్య 369 రీ రిలీజ్ కొత్త డేట్..!

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. త్వరలో మరో...

చవకబారు మీడియా.. వేషాలు అవసరమా..?

మీడియా అన్నది చేరవలసిన విషయాన్ని చేరాల్సిన చోటికి చేర్చేలా చేయడమే.. అంటే అటు రాజకీయాలైనా, సినిమాలైనా, వ్యాపారం ఇలా వ్యవహారిక విషయాలన్నిటిపై అటు వాళ్లకు ఇటు...

రాజకీయం

మాజీ మంత్రి విడదల రజనీకి అరెస్టు భయం.! అస్సలు లేదట.!

‘ఏం చేస్తారు.? మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.?’ అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ. ఒకప్పుడు తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కనని చెప్పుకున్న విడదల రజనీ,...

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

ఎక్కువ చదివినవి

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...