మత్తు వదలరా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రితేష్ రానా నుండి వచ్చిన రెండో చిత్రం మత్తు వదలరా. లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్, నరేష్ ఆగస్ట్య ప్రధాన పాత్రాల్లో నటించారు. ప్రమోలతో ఆకర్షించిన హ్యాపీ బర్త్ డే ఎలా ఉందో చూద్దామా.
కథ
రక్షణ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) పాస్ చేసిన గన్ ఆమెండ్మెంట్ బిల్ కారణంగా జనాలు గన్స్ ను వాడటం, కొనుగోలు చేయడం ఎక్కువవుతుంది.
ఇక రిట్జ్ గ్రాండ్ హోటల్ లో హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ హోటల్ లో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. అవేమిటి? ఆ హోటల్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? వాటి వల్ల అందరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది సినిమా కథాంశం.
నటినటులు:
లావణ్య త్రిపాఠి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పాలి. ఆమె చార్మ్, స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకు చక్కగా ఉపయోగపడ్డాయి. లావణ్య పాత్రను భిన్న రకాలుగా చూపించినా ఆమె సర్ప్రైజ్ చేస్తుంది.
కమెడియన్ సత్యకు మరో మంచి పాత్ర దక్కింది. ఎప్పటికప్పుడు సత్య పాత్ర పడించే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. మత్తు వదలరా ఫేమ్ నరేష్ కీలక పాత్రలో మెప్పించాడు.
మరో భిన్నమైన పాత్రలో వెన్నెల కిషోర్ నటించాడు. ఇక స్క్రీన్ నిండా పదుల సంఖ్యలో కనిపించిన ఆర్టిస్ట్ లు తమ పరిధిల మేరకు నటించారు.
సాంకేతిక నిపుణులు:
కాల భైరవ అందించిన పాటలు నిరుత్సాహపరిచాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మరోసారి కొత్త సౌండ్స్ తో ఆసక్తి కలిగించాడు. సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ వర్క్ ను కూడా మెచ్చుకోవాలి. సినిమాకు భిన్నమైన కలరింగ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాకు మూడు గంటల రన్ టైం అనేది కచ్చితంగా మైనస్. నిర్మాణ విలువలు లావిష్ గా ఉన్నాయి.
మరోసారి భిన్నమైన సెటప్ ను ఎంచుకోవడంలో రితేష్ రానా సక్సెస్ అయ్యాడు. అయితే సెటప్ కు సరిపడా పాత్రలు, వాటి చిత్రణ విషయంలో ఫెయిల్ అయ్యాడు.
పాజిటివ్ పాయింట్స్:
- పెర్ఫార్మన్స్ లు
- చిత్ర బ్యాక్ గ్రౌండ్
మైనస్ పాయింట్స్:
- ఒక తీరుగా లేని నరేషన్
- బిగి లేకపోవడం
చివరిగా:
హ్యాపీ బర్త్ డే అనేది సిల్లీ కామెడీ డ్రామా. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ కచ్చితంగా ప్లస్ అయ్యాయి. అయితే సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ముఖ్యంగా రన్ టైం సినిమాకు ప్రధాన మైనస్. ఈ చిత్రం ఓటిటిలో వచ్చే వరకూ ఎదురుచూడటం ఉత్తమం.
తెలుగు బులెటిన్ రేటింగ్: 1/5
659485 543379You ought to consider starting an e-mail list. It would take your website to its potential. 733914
932085 502303I take fantastic pleasure in reading articles with quality content material. This post is one such writing that I can appreciate. Maintain up the very good work. 765086
577214 551553Couldn?t be created any better. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a good read. Thanks for sharing! 369027