ఏపీ బీజేపీ అంటేనే ఒక్కొక్కరిదీ ఒక్కో దారి అనే అభిప్రాయం ఇప్పటికే జనాల్లో గట్టిగా బలపడిపోయింది. అధికారికంగా జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ, కొందరు నేతలు అటు తెలుగుదేశానికి వంత పాడుతుండగా.. మరికొందరు అధికార వైసీపీకి కొమ్ము కాస్తుంటారు. జనసేనతో కలిసి రాష్ట్రంలో బలపడాలనే విషయం గురించి కొంచెం కూడా ఆలోచించరు. మొన్నటివరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. తెలుగుదేశం భజన చేశారు. ప్రతి విషయంలోనూ వైసీపీని విమర్శిస్తూ.. టీడీపీకి మాత్రం ఒత్తాసు పలికేవారు. చివరకు ఆయన పదవికి గండం వచ్చి అకస్మాత్తుగా ఊడిపోయింది.
అయితే టిడిపి పార్టీ నుంచి వచ్చిన కోవర్టులను ఏరివేయడానికే సోము వీర్రాజు కు పార్టీ పగ్గాలు అప్పగించరాని వార్తలు వచ్చాయి. దానికి తగినట్టుగానే ఆయన చేతలు కూడా ఉండటంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజధానిగా అమరావతి విషయంలో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏకంగా స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.
అదే సమయంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నవారిపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా టీవీ చర్చా కార్యక్రమాల్లో జగన్ సర్కారుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్న వెలగపూడి రామకృష్ణపై వీర్రాజు వేటు వేశారు. ఇది అమరావతి ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో అఖిలభారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి.. సోము వీర్రాజుకు గట్టి షాక్ ఇచ్చారు.
తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న ఆయన.. ఈ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వెలగపూడిని హిందూ మహాసభ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వెలగపూడి ఇకపై మరింత ఎక్కువగా గళమెత్తే అవకాశం ఏర్పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును సైతం విమర్శించే వీలు చిక్కింది. ఈ నిర్ణయం పట్ల వీర్రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
292574 520866Naturally I like your web-site, nevertheless you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I discover it really silly to inform you. On the other hand I will undoubtedly come again once again! 466826
373705 25756New York Travel Tips […]below youll uncover the link to some web sites that we think you need to visit[…] 793522
144434 336702Rattling clean web website , appreciate it for this post. 123693