Switch to English

టీడీపీని వీడినా బాబుపై బోలెడు ప్రేమ.. కారణమేంటో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీ మారడం కొత్త కాదు. సొంత పార్టీని వదిలి మరో పార్టీలో చేరేటప్పుడు తమ అధినేతపై విమర్శలు చేస్తుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి ఈ విషయంలో కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణ టీడీపీకి చెందిన పలువురు నేతలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమం టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన గరికపాటి మోహన్ రావు పర్యవేక్షణలో జరిగింది.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో ఈ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా బీజేపీ పెద్దల దృష్టిలో పడటానికి గరికపాటి ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, వేదికపై ప్రసంగించేటప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 37 ఏళ్లపాటు ఉన్న కన్నతల్లి వంటి పార్టీని వీడటం బాధగా ఉందని కంట తడి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసన్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి టికెట్లు ఇవ్వలేదని, ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా కుదరులేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పార్టీ ఈ పరిస్థితిలో ఉండటానికి చంద్రబాబును తాను ఏమీ అనబోనని, ఆయన బాగుండాలనే కోరుకుంటానని వ్యాఖ్యానించారు. గతంలో పార్టీ మారిన తర్వాత ఎంపీ సుజనా చౌదరి సైతం చంద్రబాబు పై బోలెడు ప్రేమాభిమానాలు కురిపించారు. తాను ఎప్పటికీ ఆయనకు శిష్యుడినే అనే తరహాలో వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతల పట్ల విధేయత కనబరుస్తారు. పాత పార్టీ అధినేతపై అభిమానం ఉన్నప్పటికీ, బహిరంగంగా వ్యక్తంచేయడానికి సాహసించరు. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఆ పని చేయరు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

మొన్న సుజనా.. నేడు గరికపాటి తమకు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని దాచుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నీ మరిన్ని అనుమానాలు వ్యక్తం కావడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆయా నేతలు బీజేపీలో చేరారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు నిజమనిపించేలా వారి చర్యలు ఉంటున్నాయి. పార్టీ మారినా బాబుపై ప్రేమ కురిపించడానికి కారణం అదేనా అన్నది తేలాల్సి ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...