తన రాజీనామా ఆమోదించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ నేపథ్యంలో ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేనితో ఎమ్మెల్యే గంటా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. తాను రాజీనామా చేసిన చోట మళ్లీ తాను ఎన్నికల్లో నిలబడనని స్పష్టం చేశారు. ఉక్కు నిర్వాసితుడిని అభ్యర్ధఇగా నిలబెడతానని ఈ సందర్భంగా గంటా అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటివే మద్దతిచ్చిన విషయాన్ని గంటా ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ఏపీకి కేటీఆర్ వస్తారన్నారు. పరిశ్రమ పరిరక్షణ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు సైతం ఈ విషయంలో సీఎం జగన్ తో కలిసి నడుస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
616468 890888It is truly a cool and beneficial piece of details. Im glad which you shared this helpful info with us. Please keep us informed like this. Thanks for sharing. 111602
380301 690687appreciate the effort you put into obtaining us this data. Was looking on google and identified your post randomly. 195123
690840 668297Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to realize one certain gold colored strategy as to public speaking, which is private interests self. finest man jokes 542855