నేటి రోజుల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీలు చూస్తే.. అసలివన్నీ అమలయ్యేయేనా అనిపించే ముందు నవ్వు రావడం ఖాయం. అలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతలు ఇస్తున్న హామీలు ఇలానే ఉన్నాయి. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మధురైకు చెందిన 33 ఏళ్ల తులం శరవణన్ తానే స్వతంత్ర అభ్యర్ధిగా మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాడు. నామినేషన్ వేసేందుకే 20వేలు అప్పు చేసిన ఈ అభ్యర్ధి కూడా ప్రజలకు ఎన్నికల హమీలు గుప్పించాడు. అవేంటంటే..
తనను గెలిపిస్తే.. ఇంటికో హెలికాప్టర్, మూడంతస్తుల మేడ, ఏడాదికి కోటి రూపాయలు, పెళ్లి జరిగితే బంగారు ఆభరణాలు, చంద్రుడిపైకి వెళ్లడానికి ఉచిత రాకెట్ ప్రయాణం, తమ ప్రాంతంలో 300 అడుగుల కృత్రిమ మంచుకొండ, విహారానికో బోటు, అంతరిక్ష పరిశోధనా కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చదవడానికి కామెడీగా ఉన్నా శరవణన్ ఈ హామీలిచ్చారు. వీటిని ప్రచారం చేయడానికి తన మిత్రులు, సన్నిహితులతో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తానని అంటున్నారు శరవణన్. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈ ఎన్నికల ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే అమలుకు ఏమాత్రం వీలులేని ఈ హామీలపై ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే.. ఈ హామీల వెనుక తన ఉద్దేశాన్ని శరవణన్ చెప్పుకొచ్చారు. ‘ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇస్తున్న హామీలు చూస్తుంటే నవ్వొస్తోంది. దీంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకున్నాను. రాజకీయ పార్టీల హామీలన్నీ ఇలానే ఉంటాయని చెప్పాలనిపించింది. నా హామీలను ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ నన్ను ప్రజలు గెలిపిస్తే ఈ హామీలన్నీ చెత్తబుట్టలోకే వెళ్తాయి. ఎన్నికల సంఘం కూడా నాకు చెత్తబుట్టనే గుర్తుగా ఇచ్చింది’ అన్నారు. శరవణన్ ఇచ్చిన హామీలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు కనువిప్పు అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి శరవణన్ సంచలనానికి తెర తీశారు.
181321 112857I was examining some of your content on this internet site and I believe this website is rattling instructive! Maintain putting up. 40772
298486 3978Really fascinating topic , appreciate it for putting up. 203102
985156 854560i just didnt need to have a kindle at very first, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages over a book, and makes it such a good deal additional convenient. i may undoubtedly advocate this item: 895817
29028 973219Thank you for your quite great info and feedback from you. san jose car dealers 335896
349948 64538Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your website is wonderful, as well as the content material! xrumer 789366