Switch to English

రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ – మెసేజ్ సూపర్, సినిమా వీక్.!

Critic Rating
( 2.25 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie అరణ్య
Star Cast రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్లాన్కర్
Director ప్రభు సోలమన్
Producer ఎరోస్ ఇంటర్నేషనల్
Music శాంతను మొయిత్రా
Run Time 2 గంటల 42 నిమిషాలు
Release మార్చ్ 26, 2021

ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా‘గా పేరు తెచ్చుకున్న జాదవ్ పయెంగ్ లైఫ్ ని స్ఫూర్తిగా తీసుకొని రానా దగ్గుబాటి పాత్రని డిజైన్ చేసి చేసిన సినిమా ‘అరణ్య’. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వేరు వేరు నటులతో పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమా మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

తన తాతలు 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తే, ఆ అడవిలోనే పెరిగి, అక్కడి ఏనుగులకు, అడవికి 40 ఏళ్లుగా సంరక్షకుడిగా ఉంటూ, లక్షకి పైగా చెట్లు నాటినందుకు గాను రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా దగ్గుబాటి). అడవి, ఏనుగులు, అక్కడి ప్రజలు అందరూ బాగున్నారు అనుకునే టైంలో అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) ఆ అడవిలో 60 ఎకరాల్లో ఒక స్మార్ట్ సిటీ కట్టాలని అనుకుంటాడు. అనుకోవడమే కాకుండా వర్క్ కూడా మొదలు పెడతాడు. ఆ వర్క్ ని ఆపించడం కోసం అరణ్య కోర్టు నుంచి స్టే తెచ్చినా పనులు ఆపకపోవడమే కాకుండా అరణ్య పిచ్చి వాడని కొద్దీ నెలలు జైల్లో పెడతారు. అరణ్య జైలు నుంచీ వచ్చే సరికి 60కిమీ విస్తీర్ణంలో గోడ కట్టేస్తారు. దాని వలన ఆ అడవిలోని ఏనుగులకు వాటర్ ఉండదు. అక్కడి నుంచీ అరణ్య ఆ ఆడవి కోసం, ఆ ఏనుగుల కోసం ఎలా పోరాడాడు? చివరికి అరణ్య కనకమేడల రాజగోపాలం పవర్ ముందు ఓడిపోయాడా? లేక గెలిచి ఆ గోడల్ని పడగొట్టించి మళ్ళీ ఆ ప్రాంతాన్ని దక్కించుకున్నాడా? లేదా? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

రానా దగ్గుబాటి ఇందులో అద్భుతమైన నటనని కనబరిచాడు అనడంలో అతిశయోక్తి కాదు. కంప్లీట్ డిఫరెంట్ గెటప్, మ్యానరిజమ్స్ మరియు డైలాగ్ డెలివరీతో చాలా భిన్నంగా అనిపిస్తాడు. అలాగే నటుడిగా తనకి ఎంతో గుర్తింపునిచ్చే చిత్రంగా అరణ్య నిలుస్తుంది. విష్ణు విశాల్ తనకిచ్చిన పాత్రలో బాగా చేసాడు. జోయా హుస్సేన్, శ్రియ పిల్లాన్కర్ లవి చిన్న పాత్రలే అయినా ఓకే అనిపించారు. రఘుబాబు డైలాగ్స్ అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. విలన్ పాత్రలో కనిపించిన అనంత్ మహదేవన్, రవి కాలే లు బాగా చేశారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాకి ప్రత్యేక హైలైట్ గా నిలిచింది విజువల్స్ అండ్ మ్యూజిక్. రియల్ లొకేషన్స్ లో షూట్ చేసిన ప్రతి విజువల్ ని చాలా రియలిస్టిక్ గా చూపించడంతో బాగా అనిపిస్తుంది. కానీ పలు చోట్ల చేసిన సిజి షాట్స్ మాత్రం సరిగా లేదు. దాంతో సిజి షాట్ విజువల్స్ డిస్టర్బన్స్ గా అనిపిస్తాయి. పాటలు అంతగా అనిపించకపోయినా నేపధ్య సంగీతం మాత్రం చాలా సీన్స్ లో మంచి ఫీల్ ని జెనరేట్ చేస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కావడం వలన రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎడిటింగ్ లో ఎక్కువ జంప్ కట్స్ ఫీలింగ్ వస్తుంది. రన్ టైంని తగ్గిసిన్హాడంలో జరిగిన లోపమని క్లియర్ గా అర్థమవుతుంది.

ఇక ఎన్నో మంచి చిత్రాలను అందించిన ప్రభు సోలమన్ ఈ మూవీ కోసం ‘ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్న జాదవ్ పయెంగ్ లైఫ్ ని స్ఫూర్తిగా తీసుకొని చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ కథగా అంట ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో పలు కథలను చూసి ఉన్నాం. అలాగే కథనంలో కూడా ఎమోషనల్ కనెక్ట్ ని ఎక్కువగా తీసుకెళ్ళాలి. కానీ అది మిస్ అయ్యారనిపిస్తుంది. దానికి కారణం లెంగ్త్ ఎక్కువ అనిపించడం వలన చాలా కట్స్ చేశారు. అందువలన సెకండాఫ్ లో పూర్తిగా ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. మొదట్లో పాత్రల పరిచయం బాగుంది, కనెక్ట్ అవుతాం కూడా కానీ ఆ తర్వాత పాత్రలని తీసుకెళ్లిన విధానం, లాజికల్ గా మిస్ అయిన అంశాలు సినిమాకి డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా విష్ణు విశాల్ కథ ఆయన గత సినిమాలను(కుంకీ) పోలి ఉంది. ఓవరాల్ గా డైరెక్టర్ గా లెగ్థ్ ఎక్కువైనా ఎమోషనల్ జర్నీని క్లియర్ గా చూపించి ఉంటె కనెక్ట్ అయ్యేవారేమో. ఎరోస్ నిర్మాణ విలువలు ఓకే.

విజిల్ మోమెంట్స్:

– రానా అద్భుతమైన నటన
– స్టోరీ లైన్ అండ్ మెసేజ్
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్
– మొదటి 30 నిమిషాలు

బోరింగ్ మోమెంట్స్:

– కథని చెప్పిన విధానం
– ఊహాజనిత కథనం
– ఎడిటింగ్
– ఎమోషనల్ కనెక్షన్ ని మిస్ చేయడం
– వీక్ డైరెక్షన్

విశ్లేషణ:

రియల్ లైఫ్ పర్సన్ స్పూర్తితో, ఓ సూపర్బ్ మెసేజ్ తో వచ్చిన ‘అరణ్య’ సినిమా కోసం తన వంతుగా రానా దగ్గుబాటి బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాడు. కానీ కథని తీర్చిదిద్దిన విధానం, కీలకమైన ఎమోషనల్ బాండింగ్ ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోవడంతో పాటు, మొదటి 30 నిమిషాల్లో జెనరేట్ చేసిన ఓ మంచి ఫీల్ ని చివరి వరకూ హోల్డ్ చేయలేకపోవడం వలన సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిలో పాయింట్ బాగున్నా ఇంట వీక్ గా చెప్పారేంటి అనే ఫీలింగ్ ని కలగజేస్తుంది.

చూడాలా? వద్దా?: థియేటర్స్ లో ఎంజాయ్ చేసేంత లేదు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.25/5 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...