జబర్దస్త్ తో విపరీతమైన ఫేమ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం గాలోడు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దాం.
కథ:
రాజు (సుధీర్) ఒక పల్లెటూరులో ఉంటాడు. అయితే అనుకోకుండా తనపై మర్డర్ ఆరోపణలు రావడంతో తన ఊరు వదిలి సిటీకి వస్తాడు. శుక్లా వద్ద డ్రైవర్ గా పనిచేసి ఆమెతోనే ప్రేమలో పడతాడు. అయితే మళ్ళీ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు రాజు. మరి తన నిజాయితీని రాజు ఎలా నిరూపించుకున్నాడు. ఇంతకీ మర్డర్ చేసింది ఎవరు?
నటీనటులు:
ఏమాత్రం ఆలోచన లేకుండా కచ్చితంగా ఈ చిత్రం సుడిగాలి సుధీర్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఇక యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్ ల పరంగా సుధీర్ టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే చెప్పాలి. గెహెనా సిప్పి తన పాత్ర వరకూ చక్కగా చేసింది.
షకలక శంకర్, సప్తగిరి కామెడీ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నారు. సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో వీళ్ళ సీన్స్ అద్భుతంగా పేలాయి. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా చక్కగా చేసారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు కొత్తగా ఆలోచించడానికి ఏం ప్రయత్నించలేదు. రొటీన్ స్టోరీలోనే కామెడీ, యాక్షన్ ను నింపాడు. స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గానే సాగింది. చాలానే ల్యాగ్ సీన్స్ ఉన్నాయి.
సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్లుగా సాగింది. ఎడిటింగ్ ఇంకా బాగుండొచ్చు.
ప్లస్ పాయింట్స్:
- సుధీర్ పెర్ఫార్మన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బోరింగ్ స్క్రీన్ ప్లే
- రొటీన్ స్టోరీలైన్
చివరిగా:
చాలా రొటీన్ స్టోరీతో అంతే అరిగిపోయిన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన చిత్రం గాలోడు. కేవలం సుడిగాలి సుధీర్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచాడు. సుధీర్ ఫ్యాన్స్ కు కొంత మేర ఈ చిత్రం నచ్చచ్చేమో కానీ మిగతా వారు దూరంగా ఉండటం బెటర్.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5
157973 955600Deference to internet site author , some wonderful entropy. 828012
941006 554485Previously you ought to have highly effective internet business strategies get you started of acquiring into topics suitable for their web-based organization. educational 434923