అమెరికాలోని తానా సభ్యులు చేసిన సాయం నిరుపయోగమైంది. కోవిడ్ సమయంలో వారు అందించిన కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులు బుగ్గిపాలయ్యాయి. దీంతో వారు అందించిన సాయం ఎవరికీ ఉపయోగపడలేదు. వివరాల్లోకి వెళ్తే..
కోవిడ్ సమయంలో ప్రజలకు ఉపయోగపడేలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పంపించిన రూ.11కోట్ల విలువైన శానిటైజర్లు, గ్లౌజులు, మాస్క్, ఇతర సామాగ్రి ఓ అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. విశాఖలోని పెదగంట్యాడలో శ్రావణి షిప్పింగ్ యార్డ్ కు చెందిన గోడౌన్ లో ఈ సామాగ్రిని ఉంచారు. గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి.
2021 డిసెంబర్లో కెనడా నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ సామాగ్రి వచ్చింది. గోడౌన్ లో భద్రపరిచేందుకు అవసరమైన అనుమతులు రావడం ఆలస్యమైన కారణంగా పంపిణీ చేపట్టలేదు. త్వరలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పంపిణీకి సిద్ధమవుతూండగా ప్రమాదం జరిగి బుగ్గిపాలైంది. ఘటనపై రెడ్ క్రాస్ సొసైటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నామని.. విషయాన్ని తానా దృష్టికి తీసుకెళ్లామని సొసైటీ సభ్యులు తెలిపారు.
744825 375438Gnarly post mate, keep the good function, just shared this with ma friendz 363513