మలయాళ దృశ్యంకు తెలుగు రీమేక్ దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది మలయాళ దృశ్యంకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 ను మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దృశ్యంకు ఒక మంచి సీక్వెల్ అనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు దృశ్యం తెలుగుకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
దృశ్యం కథ పూర్తి అయిన కొన్నాళ్ల తర్వాత అన్నట్లుగా ఈ సినిమా మొదలవుతుంది. కేబుల్ టీవీ రాంబాబు కాస్త థియేటర్ ను కొనుగోలు చేస్తాడు. అదే సమయంలో అతడు సినిమాను నిర్మించేందుకు గాను కథను రెడీ చేయిస్తూ ఉంటాడు. మరో వైపు వరుణ్ తల్లిదండ్రులు మళ్లీ తమ కొడుకు ఆచూకి కోసం రాంబాబు కుటుంబంను వేదించడం మొదలు పెడతారు. అదే సమయంలో వారికి వరుణ్ డెడ్ బాడీ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాంబాబు మళ్లీ తన సినిమాటిక్ ప్లాన్ తో ఆ కేసు నుండి తాను బయట పడి తన కుటుంబంను బయట పడేస్తాడు. కొన్ని సంవత్సరాల ముందు నుండే రాంబాబు ఏదో ఒక రోజు వరుణ్ డెడ్ బాడీ బయట పడుతుంది కనుక అప్పుడేం చేయాలనే విషయాన్ని ప్లాన్ చేసుకుంటూనే ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటీ.. రాంబాబు మళ్లీ ఎలా బయట పడ్డాడు అనేది దృశ్యం 2 కథ.
పెర్ఫార్మెన్స్ :
రాంబాబు పాత్రలో వెంకటేష్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కుటుంబంను కాపాడుకునేందుకు ఒక మద్యతరగతి వ్యక్తి పడే ఆవేదన సినిమాలో చక్కగా చూపించారు. రాంబాబు పాత్రకు మళ్లీ వెంకటేష్ ప్రాణం పోశాడు అనడంలో సందేహం లేదు. ఇక మీనా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లుగా నటించింది. నదియా మరోసారి ఒక మంచి నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీ నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రల పరిధిలో నటించారు. అయితే ఎవరికి ఎక్కువ నటించే స్కోప్ దక్కలేదు.
సాంకేతిక నిపుణులు:
ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసినిమాను తెరకెక్కించాడు. విభిన్నమైన కథ మరియు కథనంతో అతడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. స్క్రీన్ ప్లే సాగిన విధానం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. సినిమాటోగ్రఫీ సినిమాను చాలా నాచురల్ గా ప్రేక్షకులకు చూపించడం జరిగింది. ఎటిగింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి.
పాజిటివ్ పాయింట్స్:
- కథ,
- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
- ఫస్ట్ హాఫ్,
- స్క్రీన్ ప్లే చివర్లో కాస్త నిరాశ పర్చింది,
- కొన్ని సన్నివేశాలు సహజంగా లేవు.
విశ్లేషణ :
దృశ్యం ను చూసిన వారికి దృశ్యం 2 ఒక మంచి థ్రిల్లింగ్ మూవీగా అనిపిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు సహజత్వంకు చాలా దూరంగా తీసుకు వెళ్లాడు. సినిమాటిక్ గా అనిపించడంతో పాటు కొన్ని సన్నివేశాలు మరీ అతి అన్నట్లుగా కూడా ఉన్నాయి. హీరో కొన్ని సంవత్సరాల తర్వాత జరుగబోయే విషయాన్ని గురించి ముందు నుండే ప్లాన్ చేసుకోవడం అనేది విడ్డూరం అన్నట్లుగా అనిపించక మానదు. ఓపెన్ మైండ్ తో చూస్తే సినిమా ఒక మంచి థ్రిల్లర్ గా అనిపిస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5
This is an excellent extra to fresh players, as well as well-established players.