పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం
సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: రా.5:54 ని.లకు
తిథి: భాద్రపద శుద్ధ నవమి ఉ.5:56 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ దశమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: పూర్వాషాఢ ఉ.10:38 ని. వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శోభ సా.4:50 ని. వరకు తదుపరి అతిగండ
కరణం: కౌలవ ఉ.5:56 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: సా.4:18 ని. నుండి 5:06 ని.వరకు
వర్జ్యం : సా.6:10 ని నుండి రా.7:41 ని. వరకు
రాహుకాలం: సా.4:30 గం. నుండి 6:00 ని.వరకు
యమగండం: మ.12:00 ని. నుండి 1:30 గం. వరకు
గుళికా కాలం: మ.3:07 ని.నుండి సా.4:37 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 ని.నుండి 5:20 ని.వరకు
అమృతఘడియలు: ఉ.6:02ని నుండి ఉ.7:34 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:44 నుండి మ.12:32 వరకు
ఈరోజు (24-09-2023) రాశి ఫలితాలు
మేషం: గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వృషభం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మిథునం : సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. మిత్రులతో వివాదాల నుండి బయటపడతారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం: గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.
సింహం: ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.
కన్య: బంధు మిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్తులాభాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృశ్చికం: బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి.
ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు క్రమం క్రమంగా ఇబ్బందులు తొలగుతాయి.
మకరం: కుటుం సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
కుంభం: స్థిర స్తి కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మీనం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు సలహాలు కొన్ని విషయాలలో కలసి వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.