బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఇంకెవరో కాదు, సింగర్ దామిని అట.! అదేంటీ, హౌస్‌లో దామిని యాక్టివ్‌గానే వుంటోంది కదా.? అంటే, యాక్టివ్‌గానే వుంటోంది.. పుల్లలూ పెడుతోంది.. వంటింట్లోనూ కనిపిస్తోంది.. పాటలూ పాడుతోంది.. అయినాగానీ, ఎందుకో దామిని ఎవరికీ నచ్చడంలేదు.
గ్లామర్ సంగతేమోగానీ, దామిని వల్గారిటీకి సోషల్ మీడియాలో పడుతున్న తిట్లు, ఆమె మీద జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. పైగా, దామిని హౌస్‌లో కంటెస్టెంట్లని నామినేట్ చేస్తున్న తీరు, ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్స్ అన్నీ డంబ్‌గా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే దామిని ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రేపు ఈ విషయమై స్పష్టత రాబోతోంది. సండే రోజు ఫన్‌డే మాత్రమే కాదు, ఎలిమినేషన్ కూడా. కంటెస్టెంట్లుగానే ఒకరొకరుగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుండడం గమనార్హం. కంటెస్టెంట్లు హౌస్ మేట్స్‌గా మారడాన్ని ఓ ప్రసహనంగా మార్చేశాడు బిగ్ బాస్.
కాగా, ఈ వీకెండ్ సందర్భంగా హోస్ట్ నాగ్, తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరికీ గట్టిగానే క్లాస్ పీకాడు. సందీప్, సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడని నాగ్ తేల్చాడు. యావర్ స్ట్రాంగ్ కంటెండర్ అయితే, వీకెస్ట్ కంటెండర్లు పవరాస్త్ర కోసం చివరి పోటీలో నిలవడాన్ని నాగ్ ఆక్షేపించాడు.
సేఫ్ ప్లేయర్ బ్యాడ్జీలు ఎక్కువగా గెలుచుకున్నందుకు టేస్టీ తేజకి బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున పనిష్మెంట్ ఇవ్వడం గమనార్హం. వారమంతా.. రోజులో మూడు పూటలూ వంట పాత్రలు తోమే బాధ్యత తేజకి అప్పగించాడు బిగ్ హోస్ట్ నాగార్జున.
మోపక్క, సందీప్‌కి రెండు రోజుల జైలు శిక్ష వేయాలా.? బ్యాటరీ డౌన్ చేయాలా.? అన్న ప్రశ్న నాగ్ నుంచి వస్తే, ప్రియాంక – శోభా శెట్టి తెలివిగా, రెండ్రోజుల జైలు శిక్ష.. అంటూ తమ ఉద్దేశ్యాన్ని చెప్పారు. కానీ, నాగ్ మాత్రం బ్యాటరీ డౌన్ చేసి పాడేశాడు.