Switch to English

‘చంద్రముఖి2’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది – రాఘ‌వ లారెన్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,972FansLike
57,764FollowersFollow

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

రాఘ‌వ లారెన్స్ మాట్లాడుతూ ‘‘వాసుగారు ‘చంద్రముఖి2’ మూవీ చేస్తున్నామ‌ని అనౌన్స్ చేయ‌గానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. ఆయ‌న‌తో ఫోన్ చేసి మాట్లాడితే ర‌జినీగారు బిజీ షెడ్యూల్ వ‌ల్ల చేయ‌టం లేదు మ‌రో హీరోతో చేయాల‌నుకుంటున్నాన‌ని అన్నారు. స‌రే క‌థ ఎప్పుడు చెబుతార‌ని అన‌గానే సాయంత్రం క‌ల‌వ‌మ‌ని అన్నారు. నేను వెళ్ల‌గానే ఆయ‌న క‌థ చెప్పారు. నాకెంతో న‌చ్చింది. ర‌జినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను న‌టించ‌టం అంటే ఆ రాఘ‌వేంద్ర‌స్వామిగారి అదృష్టం అని అనుకోవాలి. సూప‌ర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్ర‌ను నేనెంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించ‌లేదు. నా పాత్ర‌కు నేను న్యాయం చేస్తే చాల‌ని అనుకుని చాలా భ‌య‌ప‌డుతూ న‌టించాను. క‌చ్చితంగా సినిమా మీ అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అనుకుంటున్నాను. కంగ‌నా ర‌నౌత్ వంటి పెద్ద స్టార్‌తో న‌టించ‌టం ల‌క్కీ. ముందు ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్ట‌గానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భ‌య‌ప‌డ్డాను. ఆ విష‌యం ఆమెకు చెప్ప‌గానే ఆమె సెక్యూరిటీని బ‌య‌ట‌కు పంపేశారు. చ‌క్క‌గా కలిసిపోయి న‌టించారు. చంద్ర‌ముఖి పాత్ర‌లో భ‌య‌పెట్టారు. వాసుగారితో ఇది వ‌ర‌కు శివ‌లింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ‘చంద్రముఖి2’ చేశాం. ఈ సినిమా చేస్తున్నా అని అనుకున్న త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారికి ఫోన్ చేసి విష‌యం చెప్పాను. నా గురువుగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ‌ని అన్నారు. అలాగే ఈ సినిమాలో వేట్టయార్ రోల్ చేసిన‌ప్పుడు కూడా రజినీగారి ఆశీర్వాదాలు తీసుకునే న‌టించాను. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణిగారు, వ‌డివేలు వంటి స్టార్ క‌మెడియ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయ‌టం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. సెప్టెంబ‌ర్ 28న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు ద‌క్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజ‌న్ సినిమాలో న‌టించాను. ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ‘చంద్రముఖి2’తో ప‌ల‌క‌రిస్తాను. ఈ మూవీలో చంద్ర‌ముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియ‌ర్ సినిమా చేయాల‌ని నా ద‌గ్ర‌కు వ‌చ్చిన‌ప్పుడు నేను చంద్ర‌ముఖి 2లో చంద్ర‌ముఖిగా ఎవ‌రు న‌టిస్తున్నార‌ని అడిగాను. ఎవ‌రినీ తీసుకోలేద‌ని అన్నారు. నేను న‌టిస్తాన‌ని అడ‌గ్గానే ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. ‘చంద్రముఖి’లో కామెడీ, హార‌ర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. చంద్ర‌ముఖిని ప‌లు భాష‌ల్లో చేశారు. అయితే జ్యోతిక‌గారు ఆ పాత్ర‌ను చాలా ఎఫెక్టివ్‌గా చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. చంద్ర‌ముఖిలో జ్యోతిక‌ను చంద్ర‌ముఖి ఆవ‌హిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజ‌మైన చంద్ర‌ముఖి పాత్ర ఉంటుంది. దాని కోసం డైరెక్ట‌ర్ వాసుగారు కొత్త‌గా నా పాత్ర‌ను తీర్చిదిద్దారు. సెప్టెంబ‌ర్ 28న ‘చంద్రముఖి2’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ పి.వాసు మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ‘చంద్రముఖి2’తో రాబోతున్నాను. చంద్ర‌ముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ క‌థ‌ను సిద్ధం చేశాను. క‌చ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగ‌వ‌ల్లి సినిమా ఉంది. అందులో డిఫ‌రెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్ర‌ముఖి మ‌ళ్లీ ఎందుకు వ‌చ్చింద‌నే పాయింట్‌తో చేశాను. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి పాత్ర‌లో రాఘ‌వ లారెన్స్ న‌టించారు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణిగారితో వ‌ర్క్ చేయ‌టం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. ఇళ‌య‌రాజాగారి త‌ర్వాత అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న సినిమా. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారాయ‌న‌. త‌ప్ప‌కుండా సెప్టెంబ‌ర్ 28న వ‌స్తున్న ‘చంద్రముఖి2’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది’’ అన్నారు.

మ‌హిమా నంబియార్ మాట్లాడుతూ ‘‘చంద్రముఖి2’ నాకెంతో స్పెషల్ మూవీ. కంగనా రనౌత్‌గారు, రాఘ‌వ లారెన్స్‌గారు, వడివేలుగారు ఇలా పెద్ద స్టార్ క్యాస్ట్‌, భారీ బ‌డ్జెట్‌తో చేసిన సినిమాలో న‌టించ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. వాసుగారు వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌టం మెమ‌ర‌బుల్. సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతున్న ఈ మూవీ అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

7 COMMENTS

సినిమా

‘గేమ్ ఛేంజర్‌’పై నెగెటివిటీ: వేలంపాట కూడానా.?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎబౌ యావరేజ్,...

మంచు గొడవ.! మళ్ళీ మొదలైంది.!

మంచు కుటుంబంలో ఆస్తుల పంపకాల రగడ గురించి కొత్తగా చెప్పేదేముంది.? మోహన్‌బాబు, విష్ణు ఓ వైపు.. మనోజ్ ఇంకో వైపు.. వెరసి, ఆధిపత్య పోరు ఓ...

‘గేమ్ ఛేంజర్’ ఇంపాక్ట్.! సమాజంపై ఆ స్థాయిలో.!

శంకర్ తెరకెక్కించే సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడంటే పాన్ ఇండియా.. అనే పేరు వాడుతున్నాంగానీ, శంకర్ దర్శకత్వంలో వచ్చే...

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్...

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. సైఫ్ కు ప్రాణాపాయం...

సైఫ్ అలీ ఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో...

రాజకీయం

కూటమి విజయం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.!

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ...

Nara Lokesh: మంత్రి లోకేశ్ ఔదార్యం.. కువైట్ లో చిక్కకున్న మహిళకు సాయం

Nara Lokesh: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న మహిళను క్షేమంగా స్వస్థలానికి...

ఉభయ గోదావరి జిల్లాలు.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.!

సంక్రాంతి పండక్కి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబరాలు అంబరాన్నంటాయ్. ప్రతి యేడాదీ అంతే.. సంక్రాంతికి పొరుగు జిల్లాల నుంచీ, పొరుగు రాష్ట్రాల నుంచీ, ఆ మాటకొస్తే ఇతర దేశాల నుంచి కూడా జనం...

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

ఎక్కువ చదివినవి

చావైనా, బతుకైనా సినిమాల్లోనే ఉంటా.. రామ్ చరణ్‌ స్టేట్ మెంట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఈ క్రమంలోనే మూవీ...

సైఫ్ అలీ ఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాజాగా...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 14 జనవరి 2025

పంచాంగం తేదీ 14-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి తె. 3.41 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 11 జనవరి 2025

పంచాంగం తేదీ 11-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు. తిథి: శుక్ల ద్వాదశి ఉ 7.43 వరకు,...

వెంకటేశ్, రానాల మీద కేసు.. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు..!

హీరోలు విక్టరీ వెంకటేశ్, రానాల మీద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఫిల్మ్ నగర్ లో వెంకటేశ్ కు...