పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్ర మాసం
సూర్యోదయం: ఉ.6:06
సూర్యాస్తమయం: రా.6:04 ని
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది పర్వదినం) రా.9:49 వరకు తదుపరి చైత్ర శుద్ధ విదియ
సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం )
నక్షత్రము: ఉత్తరాభాద్ర సా.4:54 వరకు తదుపరి రేవతి
యోగం: శుక్లం ఉ.10:29 వరకు తదుపరి బ్రహ్మం
కరణం: కింస్తుఘ్నం ఉ.10:39 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: ఉ.11:41 నుండి 12:29 వరకు
వర్జ్యం : రా.తె.4:31 నుండి 6:04 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ.10:53 ని.నుండి 12:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:46 నుండి 5:34 వరకు
అమృతఘడియలు:మ.12:19:నుండి 1:50 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు
ఈ రోజు (22-03-2023) రాశి ఫలితాలు
మేషం: దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.
వృషభం: సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథునం: ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కర్కాటకం: వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.
సింహం: ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కన్య: వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
తుల: బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వృశ్చికం: వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.
ధనస్సు: కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
మకరం: సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
కుంభం: నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముక్యమైనా పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు.
మీనం: చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
914918 498948What platform and theme are you making use of if I may ask? Exactly where can I buy them? x 725746
793013 19329I do not have a bank account how can I spot the order? 863627
946250 265830Merely a smiling visitant here to share the adore (:, btw outstanding pattern . 320715
847446 583342Last month, when i visited your blog i got an error on the mysql server of yours. ~, 793636
762745 124604Hey there! Amazing stuff, please do tell us when you post once again something similar! 170628
652610 244689Thank you for sharing with us, I conceive this website genuinely stands out : D. 304694