పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం
సూర్యోదయం: ఉ.6:11
సూర్యాస్తమయం: రా.6:04 ని
తిథి: బహుళ దశమి ఉ.10:57 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం )
నక్షత్రము: ఉత్తరాషాఢ రా.12:14 వరకు తదుపరి శ్రవణం
యోగం: పరిఘ రా.1:20 వరకు తదుపరి శివం
కరణం:భద్ర ఉ.10:57 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.8:33 నుండి 9:21 వరకు తదుపరి మ.12:31 నుండి 1:19 వరకు
వర్జ్యం : ఉ.9:19 నుండి 10:49 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:56 ని.నుండి 9:25 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:50 నుండి 5:38 వరకు
అమృతఘడియలు:రా.6:17 నుండి 7:46 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : మ.12:00 నుండి 12:48 వరకు
ఈరోజు (17-03-2023) రాశి ఫలితాలు
మేషం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిథునం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.
కర్కాటకం: భూక్రయ విక్రయలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి.
సింహం: సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.
కన్య: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.
తుల: వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి.
వృశ్చికం: వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు: కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం: ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం: నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.
మీనం: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.