Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 10 అక్టోబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:55
సూర్యాస్తమయం: సా.5:41 ని.లకు
తిథి: భాద్రపద బహుళ ఏకాదశి మ . 3:08 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ ద్వాదశి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: ఆశ్లేష ఉ.7:03 ని.వరకు తదుపరి మఘ
యోగం: సాధ్యం ఉ.10:01 ని. వరకు తదుపరి శుభం
కరణం: భాలవ మ.3:08 ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం :ఉ.8:16ని. నుండి 9:03 ని. వరకు తదుపరి రా.10:34 ని.నుండి 11:23 ని. వరకు
వర్జ్యం : రా.8:22 ని. నుండి 10:08 ని. వరకు
రాహుకాలం: మ. 3:00 గం ‌‌.నుండి 4:30 ని..వరకు
యమగండం: ఉ‌.9:00 గం. నుండి 10:30 ని‌ వరకు
గుళికా కాలం: మ.12:03 ని.నుండి 1:31 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:35 ని.నుండి 5:23 ని.వరకు
అమృతఘడియలు: ఉ.5:55 ని.నుండి 7:03 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ‌11:39 ని. నుండి.మ.12:26 ని.వరకు

ఈ రోజు (10-10-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

వృషభం: ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది.

మిథునం: ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలసిరావు.

కర్కాటకం: ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

సింహం: వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కన్య: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.

వృశ్చికం: సంతాన విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.

మకరం: గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీనం: దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...