తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘నగారా’ మోగేసింది.! కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు, తెలంగాణ సహా, మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది.
ఒకే విడతలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయి. సో, తెలంగాణ ప్రజల తీర్పు నవంబర్ 30న ఈవీఎంలలో నిక్షిప్తమైతే, అధికార పీఠమెవరిదో డిసెంబర్ 3న తేలిపోతుందన్నమాట.
ఇంతకీ, తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడెలా వుంది.? నో డౌట్, అధికార భారత్ రాష్ట్ర సమితికే అడ్వాంటేజ్. కానీ, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఇక్కడ ‘తెలంగాణ’ మిస్సయ్యింది పార్టీ పేరులో. దాంతో, తెలంగాణ సెంటిమెంట్.. ఈసారి అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేలా కనిపించడంలేదు.
కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, పేరుకే తెలంగాణలో ప్రతిపక్షం. కానీ, ఆ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు అధికార బిఆర్ఎస్ లోకి దూకేశారు. అంతర్గత కుమ్ములాటలే పార్టీకి పెను శాపం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా చాలామంది సీనియర్లు ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారాయె. గెలిచే అవకాశమున్నా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నేతలే గండి కొట్టే అవకాశాలున్నాయి.
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో బలపడిన మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత చప్పబడిపోయింది. మళ్ళీ ఆ ఊపు బీజేపీకి రావడం అంత తేలిక కాదు.!
మజ్లిస్ పార్టీ ఎలాగూ అధికార బీఆర్ఎస్కి మిత్రపక్షమే. తెలంగాణలో టీడీపీ వున్నా, లేనట్టే.! జనసేన పార్టీకి కూడా తెలంగాణలో
I seriously love your website.. Great colors & theme.
Did you develop this amazing site yourself? Please reply back as I’m
trying to create my own personal site and would like to learn where
you got this from or exactly what the theme is called.
Thank you!