Dil Raju: టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇంట విషాదం నెలకొంది. ఆయనకు పితృవియోగం కలిగింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా శ్యామ్ సుందర్ రెడ్డి అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి. శ్యామ్ సుందర్ రెడ్డికి భార్య సుశీలమ్మతోపాటు దిల్ రాజు, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.
శ్యామ్ సుందర్ రెడ్డి మృతిపై సినీ ప్రముఖులు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు. దిల్ రాజుకు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.