Switch to English

క్రైమ్ న్యూస్: ఆమె ఆకలిని అలుసుగా తీసుకుని అఘాయిత్యంకు పాల్పడ్డాడు

05:30PM: ఆమె ఆకలిని అలుసుగా తీసుకుని అఘాయిత్యంకు పాల్పడ్డాడు

కరోనా కారణంగా రోజు వారి కూలీలు పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఉన్న ఎంతో మంది కార్మికులకు దాతలు సాయం చేస్తున్నారు. తమకు చేతనైనంత సాయంను పలువురు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 70 ఏళ్ల సలీముద్దీన్‌ అనే వ్యక్తి సాయం పేరుతో అఘాయిత్యంకు పాల్పడ్డాడు. యువతిపై అతడు అఘాయిత్యం చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… సలీముద్దీన్‌ ఒక యువతిని నిత్యావసర సరుకులు ఇస్తానంటూ నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. విదేశాల్లో ఉండే ఇతడికి నలుగురు భార్యలు. అప్పుడప్పుడు హైదరాబాద్‌ వచ్చి పోతూ ఉంటాడు. లాక్‌ డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు.
ఈ సమయంలో ఈయన తన చెడు బుద్దిని చూపించాడు. హైదరాబాద్‌ కమీషనర్‌ స్వయంగా ఈ కేసు విచారణ జరిపారు. నిర్భయ చట్టంతోపాటు పలు కేసులను అతడిపై పెట్టారు. అతడి పాస్‌ పోర్ట్‌ సీజ్‌ చేయడంతో పాటు అతడి విదేశీ ప్రయాణాలను కూడా రద్దు చేశారు.
05:00PM: అక్కచెల్లి మద్య చిచ్చు పెట్టిన అక్రమ సంబంధం
ఆమె ఆకలిని అలుసుగా తీసుకుని అఘాయిత్యంకు పాల్పడ్డాడు
ఈమద్య కాలంలో నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులే అనే విషయం తెల్సిందే. అక్రమ సంబంధాలు ఒకసారి కాకుంటే ఒకసారి అయినా బయట పడి గొడవకు దారి తీస్తుందనే విషయం తెలిసి కూడా గుడ్డిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. తాజాగా అక్క చెల్లి మద్య అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. చివరకు ఇద్దరు విడిపోయి పోలీసు కేసు వరకు వెళ్లాల్సి వచ్చింది.

కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అక్క సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి, చెల్లి నర్స్‌. ఇద్దరి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో చెల్లి ఒకతడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. జాబ్‌ కోసం సెర్చ్‌ చేస్తున్న అతడికి ప్రియురాలి అక్క ఉద్యోగం ఇప్పిస్తానంది. తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తే తన లైంగిక వాంచను తీర్చాలంటూ కండీషన్‌ పెట్టింది. ఉద్యోగం కోసం అతడు తన ప్రియురాలి అక్క కోరికను తీర్చాడు. అలా ఇద్దరి మద్య అక్రమ సంబంధం సాగింది.
అతడిని పూర్తిగా తనవాడిని చేసుకోవాలనుకున్న ఆమె చెల్లికి అతడిపై అసహ్యం కలిగేలా తమ లైంగిక వీడియోలను పంపించింది. దాంతో అతడి నుండి విడిపోయిన చిన్నమ్మాయి తన అక్కపై కేసు పెట్టింది. మొత్తానికి అక్రమ సంబంధంతో ప్రేమ విచ్చిన్నం అవ్వడంతో పాటు  అక్క చెల్లి మద్య సంబంధం తెగి పోయింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ట్రంప్ ఒక ఫూల్ కాబట్టే అమెరికా ఇలా ఉంది: జో బెడెన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఫూల్ అంటూ విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్. అమెరికాను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్నా అధ్యక్ష హోదాలో ఉండి...

నాకు తప్పుడు మందులిచ్చి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తున్నారు – డా.సుధాకర్

మే 16వ తేదీన మద్యం మత్తులో డా. సుధాకర్ నడిరోడ్డులో రభస చేయడమే కాకుండా, అధికార పార్టీపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మెంటల్ కండిషన్...

రివ్యూ : పాతాళ్ లోక్ (వెబ్ సిరీస్)

చీకటి రాజ్యపు నెత్తుటి మరకలతో “పాతాళ్ లోక్” ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడి ఓటీటీ ప్లాట్ ఫాంలు కళకళలాడుతున్నాయి. అదే బాటలో అమెజాన్ ప్రైమ్...

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

సినిమా జోనర్ చెప్పండి …సర్ప్రైజ్ గిఫ్ట్స్ గెలుచుకోండి.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమా ‘వ్యాక్సీన్ వస్తుంది’ (వర్కింగ్ టైటిల్). కరోనా వైరస్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర సినిమా ప్రీలుక్, మోషన్ పోస్టర్ శుక్రవారం తన...