Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం.. సాధ్యమేనా.?

సంపూర్ణ మద్య నిషేధం అనేది తెలుగు నాట సాధ్యమయ్యే పని కాదు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం కోసం ప్రయత్నించారు.. అమలు చేశారు కూడా. కానీ, అది సత్పÛలితాలివ్వలేదు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారింది. ఈ క్రమంలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. అయితే, గొప్ప ఆలోచనను కొందరు పక్కదారి పట్టించారనే విమర్శలు లేకపోలేదు అప్పటి మద్య నిషేదంపై.

ఇక, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మద్య నిషేధం.. అంటూ పబ్లిసిటీ స్టంట్స్‌ షురూ చేసింది. రేటు పెంచితే, మద్యం మానేస్తారా ఎవరైనా.? అన్న కనీస ఇంగితం లేకుండా ప్రభుత్వం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్‌ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో నాటు సారా గుప్పుమంటోందంటే దానిక్కారణమేంటి.? సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌, నాటు సారా తయారీపై ‘వాస్తవ పరిస్థితుల్ని’ కుండబద్దలుగొట్టేసిన వైనాన్ని ఎలా విస్మరించగలం.? మద్యం దుకాణాల సంఖ్య తగ్గించేస్తున్నాం.. ఇది మద్య నిషేదంలో కీలకమైన ముందడుగు.. అని ప్రభుత్వం చెబుతోంది.

మద్యం ధరలు పెంచి, ఖజానాని నింపుకున్నప్పుడూ ఇదే మాట. అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.! కరోనా విజృంభిస్తున్న వేళ, మద్యం షాపుల్ని తెరిచిన ప్రభుత్వం మద్య నిషేధం గురించి మాట్లాడితే ఎలా.? రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలతో పొరుగు రాష్ట్రాల్లోంచి మద్యం, ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా దూసుకొస్తోంది. అలా, పొరుగు రాష్ట్రాల ఖజానా నింపడంలో రాష్ట్రానికి చెందిన మందు బాబులు తమవంతు పాత్ర పోషిఉ్తన్నారని అనుకోవాలేమో. మద్య నిషేధం.. అంటే ఎకాఎకిన ఒకేసారి జరిగిపోవాలి.

కరోనా వైరస్‌ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించింది కూడా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతకాక, ఇప్పుడీ పబ్లిసిటీ స్టంట్స్‌.. అంటే మద్య నిషేధం.. అన్న మాటని జగన్‌ ప్రభుత్వం చెబుతుండడంపైనే అనుమానాలు కలుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప, మద్య నిషేధం విషయంలో జగన్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వున్నట్లు కన్పించడంలేదు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

లాక్ డౌన్ లో సురక్షితం కాని అబార్షన్లు 10లక్షలు..!

భారత్ లో గర్భం రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇదే వరుసలో అబార్షన్ చేయించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే గర్భం దాల్చకుండా తీసుకునే జాగ్రత్తల్లో...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...