కరోనా వైరస్‌కి (కోవిడ్19) ఇదిగో మందు.. అదిగో వ్యాక్సిన్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు విన్పిస్తూనే వున్నాం. ఎక్కడో నైజీరియాలో కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టాశారంటూ నిన్ననే ఓ వార్త వెలుగు చూసింది. అయితే, ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే 18 నెలల సమయం పడుతుందట. ఇక, ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు వారి అనారోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తున్నారు తప్ప.. ఖచ్చితంగా ఈ ‘మెడిసిన్’ ద్వారా కరోనా వైరస్‌ని నివారించవచ్చుననిగానీ, తగ్గించవచ్చుననిగానీ చెప్పే పరిస్థితి లేదు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుని అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ఉపయోగించాయి. గత కొద్ది రోజులుగా భారతదేశంలో రెండు ప్రముఖ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్న ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ గురించి చర్చ జరుగుతోంది. దాంతో, ఇకపై కరోనా గురించిన భయాలు అవసరం లేదనే భావన ప్రజల్లో నెలకొని వుంది. వైద్యులు మాత్రం, కరోనా సోకినవారికి చికిత్స అందించేందుకోసం మందులు వస్తున్న మాట వాస్తవమేగానీ, ప్రజలు ఇదివరకటిలానే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. పైగా, ఈ మందులతో పూర్తిగా కరోనా తగ్గిపోతుందని చెప్పలేమని అంటున్నారు.
సరిగ్గా ఈ టైవ్ులోనే పతంజలి సంస్థ నుంచి కూడా కరోనా వైరస్ చికిత్స కోసమంటూ ఓ మందు బయటకు వచ్చింది. పతంజలి ఉప్పు, పతంజలి బియ్యం.. పతంజలి నెయ్యి.. అలాగే, ఇప్పుడు పతంజలి మెడిసిన్ అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో దేన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే, అదే సమయంలో.. మందులు వచ్చేస్తున్నాయనే అత్యుత్సాహం ప్రదర్శించడమూ సబబు కాదు. సోషల్ మీడియా నాలెడ్జ్‌తో.. కొందరు ఔత్సాహికులు, ఆయా మెడిసిన్స్ విషయంలో లేనిపోని అతి ప్రచారానికి దిగుతున్నారు. ఈ తరహా ప్రచారాల పట్ల వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
101033 627642The website loading velocity is amazing. 564186
843380 501394What a outstanding viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an problem inside your blogging is it possible you ought to recheck this. thank you just as before. 423734
567082 889237As a result youll require ultra powerful online enterprise suggestions to keep operating in finding into matters correct your incredible web-based function. MLM 332643