Switch to English

స్కెచ్‌ అదుర్స్‌: ‘బిగ్‌బాస్‌’ని టార్గెట్‌ చేసిన విజయసాయిరెడ్డి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు సర్వసాధారణమే. పైగా, అధికారంలో వున్నవారికి అడ్వాంటేజ్‌ ఎప్పుడూ వుంటుంది పై ఎత్తులు వేయడానికి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి.. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భేటీ అవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఇప్పటికే ‘కులం’ ముద్ర వేసేసింది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలోనే నిమ్మగడ్డపై ‘సామాజిక వర్గం’ పేరుతో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్‌ కూడా తెచ్చారు.

ఇంతకీ, నిమ్మగడ్డతో కామినేని, సుజనా భేటీ వ్యవహారం ఎలా బయటకు పొక్కింది. సాధారణంగా ప్రముఖ హోటల్స్‌కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ అంత తేలిగ్గా బయటకు లీకయ్యే అవకాశం వుండదు. అత్యున్నత స్థాయిలోనే ఈ వ్యవహారానికి ‘స్కెచ్‌’ పడి వుండాలన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘ఆ నాలుగో బిగ్‌బాస్‌ ఎవరు.?’ అంటూ వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించడం, ఇదంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కార్నర్‌ చేయడానికేనంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తిపోతోంది.

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఇలాగే ‘బిగ్‌బాస్‌’ అంటూ చంద్రబాబు పేరు చుట్టూ నారా యాగీ జరిగిన విషయం విదితమే. చంద్రబాబు కూడా ఆ భేటీలో పాల్గొన్నారా.? సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయనకు సంబంధించిన వీడియోస్‌ త్వరలో విడుదల కానున్నాయా.? అన్న ప్రశ్నలు వైసీపీ సానుభూతిపరుల నుంచి సోషల్‌ మీడియాలో దూసుకొస్తున్నాయి. ‘మరిన్ని వివరాలు అతి త్వరలో..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేశారంటే.. మొత్తం కథకు సంబంధించిన కీలక సమాచారం అంతా అధికార పార్టీ దగ్గర వుండే వుండాలి.

తొలుత ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి స్పందన లాంటి బుకాయింపు రావాలి.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అధికార పార్టీ నుంచి ‘వివరాలు’ బయటకు వస్తాయన్నమాట. చిత్రమేంటంటే, కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి.. ఈ ఇద్దరూ బీజేపీ నేతలు. అయినాగానీ, బీజేపీని విమర్శించేందుకు వైసీపీ నేతలెవరూ సాహసించడంలేదు.. విజయసాయిరెడ్డితో సహా. అన్నట్టు, తన మీద 108 కుంభకోణం.. అంటూ ఆరోపణలు వస్తున్న దరిమిలా ఇప్పటిదాకా దానిపై స్పందించని విజయసాయిరెడ్డి, ఈ నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం ఆశ్చర్యకరమే కదా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...