Switch to English

దేశంలో 10,000 మార్క్‌ దాటేయనున్న కరోనా.!

ఇది నిజంగానే ఆందోళన కలిగించే విషయం. వెయ్యి పాజిటివ్‌ కేసులు నమోదవడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది మన దేశంలో. కానీ, ఆ తర్వాత క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజుకి వెయ్యి కేసులు నమోదయ్యే స్థాయికి చేరుకుంటోంది దేశంలో పరిస్థితి. ‘పరిస్థితి ఆందోళనకరంగానే వుంది..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు నిలకడగానే వున్నా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతోంది. ఇప్పటికే 9 వేలపైన కరోనా పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఈ రోజు 10 వేల మార్క్‌ని అందుకోబోతోంది. కేసుల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదన్న ప్రచారం దేశ ప్రజానీకాన్ని భయపెడుతోంది.

లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా.. కేసుల తీవ్రత తగ్గకపోవడానికి కారణం ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌ తబ్లిగీ’ ఘటనేనన్నది నిర్వివాదాంశం. అసలు ఆ తబ్లిగీ వ్యవహారమే లేకపోయి వుంటే, దేశంలో 3000 కేసులు కూడా ఈపాటికి నమోదయ్యేవి కాదేమో.! కారణం ఏదైతేనేం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

లాక్‌డౌన్‌ వల్లనే కేసుల తీవ్రత పది వేలకు లోబడి వుందనీ.. లేదంటే, ఈపాటికే.. పరిస్థితి అదుపు చేయలేనంత దారుణంగా వుండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక, మహారాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకీ అంచనాలకు మించి పెరిగిపోతోంది. తమిళనాడులోనూ పరిస్థితి దాదాపుగా ఇలానే కన్పిస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా వుండడంతో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందా.? ఎత్తివేత తప్పదా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే లాక్‌డౌన్‌ ఎత్తివేయడం తప్ప ఇంకో మార్గం లేదు. కానీ, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసకుకుంటే మాత్రం లాక్‌డౌన్‌ కొనసాగించి తీరాల్సిందే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...

కొడుకు ప్రాణాలు కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఊరుకోగలడు. తన ప్రాణాలైనా పణంగా పెట్టి కాపాడాలనుకుంటాడు కదా. ఒక హాలీవుడ్ నటుడు కూడా ఇలాగే కొడుకు ప్రాణాలు కాపాడబోయి తన...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...