Switch to English

హమ్మయ్య బాలయ్య ఆ సినిమా చెయ్యట్లేదు

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ జనాలలో ఒక రకమైన క్రేజ్ ఉంది. మనసు పెట్టి బాలయ్య ఒక మాస్ సినిమా చేసాడంటే రికార్డులు బద్దలుకావడం ఖాయం. అయితే బాలకృష్ణ తన సినిమాల ఎంపిక పట్ల విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తనను బెస్ట్ గా చూపించే దర్శకులతో కాకుండా అసలు ఫామ్ లో లేని వాళ్ళను, సినిమాలు చేయడం ఆపేసి మళ్ళీ మొదలుపెట్టాలని చూస్తున్న వాళ్లకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు.

ఈ మధ్య బాలయ్య సినిమాలు చూసుకుంటే బోయపాటి శ్రీను, క్రిష్ తప్ప మిగతా వారందరూ అవుట్ డేట్ అయిన వారే. పి. వాసు, కె.ఎస్ రవికుమార్, జయంత్ సి పరాన్జీ, దాసరి నారాయణరావు లాంటి దర్శకులు లో ఫేజ్ లో ఉన్న సమయంలో, అసలు స్క్రిప్ట్ పై గ్రిప్ కోల్పోయిన తరుణంలో వాళ్ళతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు బాలయ్య.

అయితే ఎన్ని పరాజయాలు ఎదురైనా కానీ బాలయ్యలో మార్పు మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న ఈ నందమూరి హీరో తర్వాతి సినిమాను ప్రేక్షకులు అందరూ ఎప్పుడో మర్చిపోయిన దర్శకుడు బి. గోపాల్ తో అన్న వార్తలు వచ్చాయి. దీనికి కథ అందించేది కూడా చిన్ని కృష్ణ అట. ఈయన లాస్ట్ హిట్ ఏదంటే చెప్పడం కూడా కష్టమే. ఇద్దరూ పూర్తిగా ఔటాఫ్ ఫోకస్ లో ఉన్న సమయంలో వాళ్లతో సినిమా చేయడం ఎంతవరకూ సమంజసం.

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోంది అన్న వార్తలు బాలయ్య అభిమానులను నిజంగానే కలవరపెట్టాయి. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం ఫామ్ లో లేడు. గతేడాది హ్యాట్రిక్ డిజాస్టర్స్ నమోదు చేసాడు. బోయపాటి సినిమాతో హిట్ వచ్చినా మళ్ళీ బి. గోపాల్ వంటి దర్శకులతో సినిమాలు చేసి తిరిగి ప్లాప్ అందుకోవడం అభిమానులకు ఇష్టం లేదు.

అయితే కారణం తెలియదు కానీ బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ ను డ్రాప్ చేశాడన్న వార్త అభిమానులను ఇప్పుడు సంతోషపెడుతోంది. లాక్ డౌన్ పరిస్థితులు, సినిమా షూటింగ్ లు లేట్ అవ్వడం, సినిమా ఇండస్ట్రీ లాస్ లు వంటి కారణాలతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను బాలయ్య హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌: ఎస్‌ఇసిగా నిమ్మగడ్డకు లైన్‌ క్లియర్‌

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం...

బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి...

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

కరోనా ఎఫెక్ట్‌ : ఇండియాను బ్యాన్‌ చేసిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు విదేశాలతో పూర్తి సంబంధాలను కట్‌ చేసుకున్నాయి. జపాన్‌ దేశంకు ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు...