Switch to English

సీజేఐ గొగోయ్ పై ‘మీ టూ’ ఆరోపణలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ‘మీ టూ’ విదాదంలో చిక్కుకున్నారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ 35 ఏళ్ల మహిళ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ గా పనిచేసిన ఆమె ఈ మేరకు 22 మంది న్యాయమూర్తులకు అఫిడవిట్ సమర్పించారు. గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని అందులో ఆరోపించారు. ఆయన చర్యలను ప్రతిఘటించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పాలుచేయడంతోపాటు తనను అకారణంగా ఉద్యోగం నుంచి కూడా తొలగించారని వివరించారు. తనకు ఎదురైన అన్ని అనుభవాలను ఆమె అఫిడవిట్ లో పొందుపరిచారు.

‘నన్ను 2018 ఆగస్టులో సీజేఐ ఇంట్లోని కార్యాలయంలో నియమించారు. అనంతరం 2018 అక్టోబర్ 10, 11వ తేదీల్లో నాపై ఆయన వేధింపులకు పాల్పడ్డారు. తొలుత నన్ను గట్టిగా కౌగలించుకున్నారు. నా శరీరమంతా తన చేతులతో తడిమారు. నేను ఆయన నుంచి విడిపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ ఆయన వదల్లేదు. తనను కూడా గట్టిగా పట్టుకోవాలని బలవంతం చేశారు. నేను ఆయన చర్యల్ని ప్రతిఘటించాను. దీంతో నాపై కక్షగట్టారు. డిసెంబర్ 21న నన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. నేను అనుమతి లేకుండా ఒకరోజు సెలవు పెట్టడమే ఇందుకు కారణమని అందులో పేర్కొన్నారు. అంతటితో నాపై వేధింపులు ఆగలేదు. ఢిల్లీలో పోలీసు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నా భర్త, బావని డిసెంబర్ 28న ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. 2012లో ఓ కేసుకు సంబంధించి జోక్యం చేసుకున్నారనే కారణంతో ఇప్పుడు వారిని ఇలా సస్పెండ్ చేశారు.

ఇక ఈ ఏడాది జనవరి 11న ఓ మహిళా పోలీసు అధికారి సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణ చెప్పించారు. ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పమన్నారు. వారు అలా ఎందుకు చేయమన్నారో తెలియనప్పటికీ, పోలీసు అధికారి సూచనల మేరకు అలాగే చేశాను. అనంతరం సుప్రీమ్ కోర్ట్ లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న దివ్యాంగుడైన నా బావను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది జరిగిన తర్వాత రాజస్తాన్లోని మా ఊరికి వెళ్లినప్పుడు నన్ను, నా భర్తను చీటింగ్ కేసులో విచారించాలంటూ అరెస్టు చేశారు. మరుసటి రోజు మా బంధువులను కూడా అదపులోకి తీసుకుని కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి నానా హింసలు పెట్టారు’’ అని ఆమె అఫిడవిట్లో ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పులను కూడా ఆధారాలుగా సమర్పించారు.

వాటిలో ఆమె భర్త సంకెళ్లతో పోలీస్ స్టేషన్ లో ఉన్న దృశ్యాలు, భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారితో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్లపాటు నిస్వార్థంగా సేవలందించిన తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. తనను తొలగించాలనే కుట్రతోనే ఎవరో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారమని, ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ తాను ఎవరికీ భయపడబోనని, తన కుర్చీలో కూర్చొని విధులు నిర్వహిస్తానని స్పష్టంచేశారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...