మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే… ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అభిమానులు కూడా ఈ సినిమా పట్టాలెక్కితే చూడాలని చాలా ఆశతో వున్నారు. అయితే , తాజాగా తన చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ… రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడని… మన దేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని చిరంజీవి కొనియాడారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా లోతుగా చూస్తారని, ప్రతి ఒక్కటి ఎంతో పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తారని… ఆయన కోరుకునే ఔట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో, లేదో తనకు తెలియదని చెప్పారు. మరోవైపు రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తెరకెక్కిస్తారని… ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదేళ్ల పాటు తీసుకుంటారని… అంత సమయాన్ని తాను ఇవ్వలేనని అన్నారు. ప్రస్తుతం తాను ఒకే సారి నాలుగు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కారణం వల్లే రాజమౌళితో సినిమా చేయాలని కానీ, పాన్ ఇండియా స్థాయి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కానీ తనకు లేదని తెలిపారు. ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు.
చిరు చెప్పిన సమాధానంతో అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు, కానీ రాజమౌళి డైరెక్షన్ చేసిన మగధీర సినిమాలో మెగాస్టార్ చేసిన ఒక చిన్న కామియో రోల్ అప్పట్లో ఎంతటి సెన్స్ సేషన్ అయ్యిందో అందరికీ తెల్సిందే.. అందుకే ఏదో ఒక సమయంలో టాలీవుడ్ టాప్ హీరో చిరు, ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి కలిసి ఒక సినిమా చేయాలన్న అభిమానుల కోరిక కూడా సమంజసమే.
310680 83456Enjoyed reading this, really very good stuff, thankyou . 634299
392648 916540As I site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You should keep it up forever! Good Luck. 612084