Switch to English

‘ది ఘోస్ట్ ‘ క్లాస్ గా తీసిన పక్కా మాస్ సినిమా.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

91,316FansLike
57,007FollowersFollow

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రం భారీ అంచనాలతో దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ది ఘోస్ట్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?

ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్.

నాగార్జున గారిని కలసి కథ చెప్పడం ఎలా అనిపించింది ?

నిర్మాతలు సునీల్, శరత్ మరార్ లని ముందు కలవడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ చర్చ నడుస్తునపుడు.. వేరేది చేద్దామని నాగ్ సర్ అన్నారు. నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని కథ రాయడం జరిగింది.

తొలిసారి హీరో ని అనుకోని కథ రాశారు కదా ? ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?

నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్ వచ్చేస్తుంది. నన్ను అడిగితే ముందు కథ రాసుకొని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం.

ది ఘోస్ట్ లో తమహగనే లాంటి ఆయుధాలు కూడా డిజైన్ చేశారు కదా ?

నాగార్జున గారు ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తారు. అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్ లో పాల్గొనివుంటారు. అలా తన జర్నీ లో జపాన్ వెళ్లినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహగనే. ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ. 12 యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. ప్రేక్షకులకు అడ్రినల్ రష్ ఇచ్చే సినిమా.

హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ?

సోనాల్ చౌహాన్ చాలా అంకిత భావంతో పని చేసే నటి. మాకు చాలా సమయం ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేసింది.

మీ తొలి మూడు చిత్రాలు సొంత ప్రొడక్షన్ లో చేశారు కదా.. ఇప్పుడు వేరే ప్రొడక్షన్.. ఈ విషయంలో ఎలాంటి తేడాలు.. సవాళ్ళు వుంటాయి?

క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు.

ది ఘోస్ట్ విషయంలో మీరు ఎదుర్కొన్న పెద్ద సవాల్ ఏంటి ?

కోవిడ్ (నవ్వుతూ). సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ వలన షూటింగ్ షెడ్యుల్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి.

ఎక్కువ నార్త్ నటీనటులు వున్నారు కదా ?

పాత్రలకు తగ్గట్టుగానే ఎంపిక చేశాం, నార్త్ అయినప్పటికీ డబ్బింగ్ వారే చెప్పారు.

ది ఘోస్ట్ ఎలా వుండబోతుంది ?

హై ఎమోషన్స్ హీరోయిజం వున్న చిత్రమిది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. విజిల్ వేసే మూమెంట్స్ కూడా వుంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది.

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిందని అంటున్నారు.. ఇలాంటి సమయంలో ఒక కథ రాసినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

కోవిడ్ వలన ఒక మేలు జరిగింది. అందరూ వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు, సినిమా అంటే ఎలాంటి క్యాలిటీ, మంచి సినిమా ఎదో ఉండాలో ప్రేక్షకులకు తెలిసింది. ఏది థియేటర్ సినిమా నో ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

ది ఘోస్ట్ విడుదలైన రోజునే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ విడుదలౌతుంది కదా ? పోటీ ఎలా వుండబోతుందని భావిస్తున్నారు ?

ఇందులో పోటీ లేదు. రెండు భిన్నమైన సినిమాలు. బావున్న ప్రతి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వరుణ్ తేజ్ గారితో సినిమా అక్టోబర్ 10 నుండి యూకే లో మొదలౌతుంది. ఒక వెబ్ సిరిస్ ప్లాన్ కూడా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి...

సుధీర్ బాబు ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా...

రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలి 13మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగిన ఘటనలో 13 మందికి పైగా గాయపడ్డారు. మరో నలుగురికి తీవ్ర...

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – బిలో యావరేజ్ రియలిస్టిక్ డ్రామా

నాంది చిత్రంతో సీరియస్ రియలిస్టిక్ డ్రామాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ మరోసారి అలాంటి జోనర్ కు చెందిన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రోమోలతో ఇదేదో సీరియస్, హార్డ్ హిట్టింగ్ చిత్రంలా అనిపించిన...

‘జడ్జిల బదిలీ వెనక్కు తీసుకోవాలి..’ ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం వివిధ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు...