Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమకు నెంబర్ వన్ హీరో అయ్యారంటే ఆయనకు ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ కారణం. నాలుగు దశాబ్దాలుగా మాస్ ఇమేజ్ ఆయనకు కవచం. ఆయనకు ఎనలేని కీర్తి కిరీటం. అందుకే ప్రతి హీరో మాస్ ఫాలోయింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. అదొక్కటే సరిపోదు. కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించాలి. ప్రేక్షకులు ఒక హీరోను తమ వాడు అనుకుంటే ఇక వారికి తిరుగుండదు. అలా అనుకోవాలంటే ఫ్యామిలీ ఇమేజ్ కావాలి. మాస్ ఇమేజ్ కు ముందు చిరంజీవి ఫ్యామిలీ ఇమేజ్ పొందారు. ఆ గుర్తింపే మాస్ హీరోగా ఎదిగేందుకు కారణమైంది. ఆయనకు ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిన మొదటి సినిమాగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ను చెప్పుకోవాలి.

చిరంజీవి బర్త్ డే స్పెషల్:  ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’

 

ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందితే..

కుటుంబ ప్రేక్షకులకు చేరువైతే ఆ హీరోని తమ ఇంట్లో వ్యక్తిగా ఆరాధిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇమేజ్, వారి స్టార్ డమ్ కు అవే కారణం. చిరంజీవి అదే సాధించారు. తర్వాత రోజుల్లో ఫ్యాన్స్ తోపాటు మహిళా ప్రేక్షకులు ఆయనకు వీరాభిమానులు అయ్యారు. కుటుంబం, భార్య విధేయుడిగా, సంసారంలోని అలకలు, సరసాలు, భావోద్వేగాలు పండించే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. ఇదే ఆయనకు మరింత ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గర చేసింది. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకం. సినిమా ఆద్యంతం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కడం.. సినిమా చూస్తున్నట్టు కాకుండా తమ ఇంట్లోనే ఉన్నామనే భావన ప్రేక్షకులకు కలగించడమే ఈ సినిమా ప్రత్యేకత.

 

చిరంజీవి సందేహించినా..

సినిమాలో హీరోయిన్ మాధవిని ఆటపట్టించడం, పూర్ణిమతో సరదా సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కాపురంలో చిరంజీవిని మాధవి పెట్టే ఇబ్బందులు.. వాటిని తట్టుకోవడం సంసారంలో చక్కిలిగింతలు, సెంటిమెంట్ ప్రేక్షకులకు నచ్చాయి. మొదట సినిమా చేసేందుకు చిరంజీవి సందేహించారు. ఈ సినిమా వచ్చే సమయానికి ఇండస్ట్రీలో 4ఏళ్లు.. 37 సినిమాలు చేసిన అనుభవం చిరంజీవిది. అటు మాస్, ఇటు క్లాస్, విలనిజం నుంచి యాక్షన్ హీరోగా చేస్తున్న చిరంజీవి ఇంతటి క్లాస్ సినిమాలో ప్రేక్షకులు తనను ఆదరిస్తారా.. అనే సందేహం మొదలైంది. అయితే.. రెగ్యులర్ హీరోల కంటే చిరంజీవి ఈ పాత్రకు సరిపోతారని కోడి రామకృష్ణ ఆయన్ను ఒప్పించారు.

చిరంజీవి బర్త్ డే స్పెషల్:  ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’

 

అద్భుత విజయం..

కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982 ఏప్రిల్ 22న సినిమా విడుదలైంది. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. కథా రచయిత కోడి రామకృష్ణ కాగా.. మాటలు గొల్లపూడి మారుతీ రావు రాశారు. ఆయనకూ ఇదే తొలి సినిమా. కోడి రామకృష్ణకు, చిరంజీవికి ఇంత లాంగ్ రన్ ఆడిన తొలి సినిమా ఇదే. జేవీ రాఘవులు సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. 8 కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు 2 కేంద్రాల్లో ఆడింది. హైదరాబాద్ లో 365 రోజులు ఆడింది. నిర్మాతగా రాఘవకు భారీ లాభాలు.. తొలి చిత్రమే కోడి రామకృష్ణకు భారీ విజయం.. చిరంజీవిని ఫ్యామిలీ ఇమేజ్ దక్కాయి. ఆ తర్వాత ఆయన ప్రస్థానం మరో మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే.

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...