Switch to English

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఈ చంద్రబాబుకి ఏమయ్యింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

నలభయ్యేళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం తన సొంతమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్స్‌లో తానూ ఒకడినని పదే పదే తన గురించి తానే చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం చూస్తూనే వున్నాం. పరిస్థితులు అనుకూలించడంలేదో.. ఆయన తీరే అంతటిదోగానీ.. చంద్రబాబుకి పండగలనగానే ఒళ్ళు మండిపోతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు జరపకుండా, విడిపోయిన రోజు.. అదే జూన్‌ 2న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చేవారు చంద్రబాబు. ఇప్పుడు అమరావతి రగడ పేరుతో సంక్రాంతి పండక్కి నానా యాగీ చేశారీ సీనియర్‌ పొలిటీషియన్‌.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, 3 రాజధానుల విషయమై రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొంత సంతోషకర వాతావరణం నెలకొన్న మాట వాస్తవం. రాయలసీమలో అయితే దాదాపుగా మూడు రాజధానులకు సపోర్ట్‌ లభిస్తోంది. ఉత్తరాంధ్ర సంగతి సరే సరి. కృష్ణా – గుంటూరు జిల్లాల్లో కేవలం అమరావతి ప్రాంతంలోనే ఆందోళన ఎక్కువగా వుంది. అది మినహాయిస్తే.. మిగతా రాష్ట్రమంతా మూడు రాజధానులకు మద్దతిస్తోందని అనలేంగానీ.. అమరావతి ఆందోళనని పట్టించుకోవడంలేదని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఈ పరిస్థితుల్లో, కేవలం 29 గ్రామాల సమస్యని నెత్తికెత్తుకుని.. చంద్రబాబు ఏకంగా సంక్రాంతి పండగని జరుపుకోవద్దని పిలుపునివ్వడమేంటి.? నిజానికి ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదు. కానీ, అలాగే ప్రొజెక్ట్‌ అవుతోంది. రాష్ట్రమంతా చంద్రబాబు జోలెపట్టుకు తిరుగుతున్నా.. అమరావతికి మద్దతుగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు ఉద్యమించడంలేదన్నది నిర్వివాదాంశం.

అయినా, పండగలు ఆపేసుకుంటే.. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తలొగ్గుతుందా.? ఇదెక్కడి ఆలోచన.? అమరావతి ప్రజలకు సంఘీబావం తెలపాలనడం వరకూ బాగానే వుంది. కానీ, ఇదేం పైత్యం. ఇలాంటి అర్థం పర్ధం లేని వాదనలతో చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకోవడమే కాదు.. ఆయా ఉద్యమాల్నీ నీరుగార్చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...