కులం, మతం, ప్రాంతం అనేవి ప్రస్తావన లేని రాజకీయాల్ని ఆశించడం పెద్ద బూతుగా మారిపోయిందిప్పుడు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కులం పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన విషయం కాదు. కులం, మతం, ప్రాంతం చుట్టూ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా చాలా ఎక్కువ. అవే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణమన్న వాదన లేకపోలేదు. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయినా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కులాల చుట్టూ నడుస్తోన్న రాజకీయ పైత్యం మాత్రం చల్లారడంలేదు.
ఇక, ఈ తరహా రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు తాను ఆ కుల రాజకీయాల బాధితుడినంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మీద ‘కులం’ ముద్ర వేసింది తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీకి అనుకూలంగా నడిచే మీడియా సంస్థలే. పవన్ కళ్యాణ్, 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినా.. ఆయన మీదా కులం ముద్ర వేసింది టీడీపీ.. దాంతోపాటుగా ఆ పార్టీ అనుకూల మీడియా. ‘టిట్ ఫర్ టాట్’ అన్న చందాన, ఆంధ్రప్రదేవ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ‘కుల రాజకీయాల్లో’ తానేం తక్కువ తిన్లేదని నిరూపిస్తోంది.
సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్‌కి ‘కులం’ ఆపాదించిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఇక, ‘కులం’ పేరుతో అమరావతిపై ఆరోపణలు చేయడం.. అమరావతి కోసం ఉద్యమిస్తోన్న రైతులపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడం.. చూస్తూనే వున్నాం. అమరావతిని ఏకంగా వైసీపీ ‘కమ్మరావతి’గా చెబుతోంది. ఈ పరిణామాలపై చంద్రబాబు చిత్రంగా ‘కలత’ చెందారు. ‘నాకు కులాన్ని ఆపాదిస్తున్నారు..’ అంటూ వాపోయారు. రాజకీయాల్లో వున్నవారెవరైనా చెప్పేది ఈ మాటే.
అంతెందుకు, ‘కులం చూడం.. మతం చూడం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పడంలేదా.? ఏదిఏమైనా, కులం.. మతం.. ప్రాంతం.. ప్రస్తావన లేని రాజకీయాలు రాష్ట్రానికి అవసరం. దురదృష్టవశాత్తూ అది అసాధ్యంగానే కన్పిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలే ఈ కుల, మత, ప్రాంత ప్రస్తావనలకు కారణమన్నది నిర్వివాదాంశం.
734283 502459Fascinating, but not perfect. Are you going to write more? 467026
506986 695590Sounds like some thing a great deal of baby boomers need to study. The feelings of neglect are there in many levels when a single is more than the hill. 227217