నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో హెచ్డీబీమహేష్బాబు అనే హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. నేడు సాయంత్రం ఆరు గంటల వరకు అంటే సరిగ్గా 24 గంటల్లో ఏకంగా ఆరు కోట్లకు పైగా ట్వీట్స్ ను ఆ హ్యాష్ ట్యాగ్ తో చేసి ఆల్ టైం ప్రపంచ రికార్డు ను నమోదు చేశారు. రెండు వారాల క్రితం ఇదే మహేష్ బాబు ఫ్యాన్స్ మూడు కోట్ల ట్వీట్స్ తో ఆల్ ఇండియా రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆల్ టైం వరల్డ్ రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది అంటూ ఫ్యాన్స్ అధికారికంగా ప్రకటించారు.
60.2 మిలియన్ల ట్వీట్స్‌కు పైగా 24 గంటల్లో చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పట్టుదల చూసి బాలీవుడ్ స్టార్స్ కూడా ముక్కున వేలసుకుంటూ ఉంటారు. ఈ స్థాయిలో అభిమానులు ఉంటారా అంటూ వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎన్టీఆర్ రెండు కోట్ల ట్వీట్స్ తో మొదలైన ఈ ట్విట్టర్ రికార్డుల వేటలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఏకంగా ఆరు కోట్ల ట్వీట్స్‌కు చేరి ఇతర స్టార్ హీరో ఫ్యాన్స్ కు చాలా గట్టి రికార్డును క్రియేట్ చేశారు.
ఈ నెలలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే మరియు వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ బర్త్‌డేలు ఉన్నాయి. కనుక మెగా ఫ్యాన్స్ ఏమైనా సూపర్ ఫ్యాన్స్ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తారా చూడాలి. గతంలో ఎన్టీఆర్ రికార్డును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బద్దలు కొట్టగా పవన్ ఫ్యాన్స్ రికార్డును సూపర్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. ఇప్పుడు వారి రికార్డును వారే బద్దలు కొట్టుకుని సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఆల్ టైం వరల్డ్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదు. ఈ రికార్డ్‌కు ఖచ్చితంగా సూపర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిని అభినందించాల్సిందే.
893592 689785Some genuinely interesting information , nicely written and loosely user genial . 674789