Switch to English

అచ్చెన్నతో టీడీపీ అధినేత చంద్రబాబు దాగుడు మూతలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ శాఖకు అధ్యక్షుడు కాబోతున్నారన్న ప్రచారం ‘కరోనా’కి ముందు నుంచే వినిపిస్తోంది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి రావడంతో, తెరపైకి అచ్చెన్నాయుడి పేరుని తీసుకొచ్చారు చంద్రబాబు. ‘ఆలస్యం.. అమృతం.. విషం..’ అని పెద్దలు ఊరికే అన్నారా.? అయినాగానీ, చంద్రబాబుకి అవేమీ పట్టవు. అప్పటినుంచీ అలా సాగదీస్తూ సాగదీస్తూ వచ్చారు.

ఇప్పటికీ ఆ సాగతీత అలాగే కొనసాగుతోంది. నిజానికి, అచ్చెన్న ఈ బాధ్యతను తీసుకోవడానికి సుముఖంగా లేరన్న వాదనలూ లేకపోలేదు. మరోపక్క, అచ్చెన్నకు ఆ పోస్ట్‌ ఇవ్వడం నారా లోకేష్‌కి నచ్చడంలేదన్న ప్రచారమూ లేకపోలేదు. ‘అబ్బే, అదేం లేదు.. అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తథ్యం..’ అని చెబుతోంది టీడీపీ. అచ్చెన్న విషయంలో అంత క్లారిటీతో వున్నప్పుడు, చంద్రబాబు ఎందుకు అచ్చెన్న పేరు ప్రకటించడంలో మీనమేషాల్లెక్కెడుతున్నట్లు.? పేరుకే ఏపీ అధ్యక్షుడు.. పెత్తనమంతా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌దే.

ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. టీడీపీ జాతీయ పార్టీ అనే భావనలో చంద్రబాబు వున్నారు గనుక.. ఏపీ టీడీపీ, తెలంగాణ టీడీపీ అని చెబుతున్నారు. తెలంగాణలో పార్టీకి అంత సీన్‌ లేదని చంద్రబాబుకి తెలుసు గనుక.. నారా లోకేష్‌కి, తెలంగాణ బాధ్యతల్ని అప్పగించలేదు. ఏపీలోనూ అదే పరిస్థితి. చంద్రబాబు, ఆయన తనయుడు.. ఇద్దరూ జాతీయ నాయకులే. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడైతే, నారా లోకేష్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి.

ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెన్న కాదు కదా, ఎవరొచ్చినా పార్టీకి అదంగా ఒనగూడే లబ్ది ఏమీ వుండదు. ఏదో అచ్చెన్నను అలా తృప్తి పర్చాలనో, అచ్చెన్న పేరుతో పొలిటికల్‌ స్టంట్‌ చేయాలనో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారంతే. ఇక, చంద్రబాబు చేస్తున్న ‘ఆలస్యం’తో అచ్చెన్నాయుడిలో ఏదన్నా ఓ మూల చిన్న ‘ఆసక్తి’ వుంటే, అది కూడా పోతుంది.. పార్టీ ఏపీ అధ్యక్ష పదవి విషయంలో.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...